హీరోయిన్ కోసం టిల్లు ఎదురుచూపులు..

హీరోయిన్ కోసం టిల్లు ఎదురుచూపులు..

సిద్దు హీరోగా వచ్చిన డీజే టిల్లు ఎంత పెద్ద హిట్ అయ్యిందో చెప్పాల్సిన పనిలేదు. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టడమే కాదు సిద్దు ను స్టార్ హీరో ను చేసింది. ఈ మూవీ టైంలోనే దీనికి సీక్వెల్ ఉంటుందని ప్రకటించిన మేకర్స్..రీసెంట్ గా సీక్వెల్ ను మొదలుపెట్టారు. అయితే అంత బాగానే ఉంది కానీ సిద్దు కు సెట్ అయ్యే హీరోయిన్ మాత్రం దొరకడం లేదు. ముందుగా ఈ మూవీ లో పెళ్లి సందD ఫేమ్ శ్రీలీల ను అనుకున్నారు.

కానీ ఆమె వేరే సినిమాల షూటింగ్స్ తో తప్పుకుంది. ఆ తర్వాత అనుపమ ను ఫిక్స్ చేసారు. షూటింగ్ సైతం మొదలుపెట్టారు. మధ్యలో ఏమైందో సడెన్ గా ఆమె సినిమా నుండి తప్పుకుంది. ఆ తర్వాత ప్రేమమ్ ఫేమ్ మడోన్నా సెబాస్టియన్‌ను అనుకున్నారు. ఆమెతో ఫొటో టెస్ట్ చేసిన తరవాత పాత్రకు ఆమె సెట్ కాదని మేకర్సే వద్దనుకున్నారు. ప్రస్తుతం మరో బ్యూటీ కోసం వెతుకుతున్నారు.

ఇక ‘డీజే టిల్లు’కు విమల్ కృష్ణ దర్శకత్వం వహించగా.. ‘టిల్లు స్క్వేర్’కు మాత్రం మల్లిక్ రామ్ దర్శకత్వం వహిస్తున్నారు. డీజే టిల్లు టైటిల్ సాంగ్‌ను కంపోజ్ చేసిన రామ్ మిరియాల.. ‘టిల్లు స్క్వేర్’కు పూర్తిస్థాయి సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. నవీన్ నూలి ఎడిటర్. సాయి ప్రకాష్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

follow us