వెంకన్నకే తప్పని కరోనా ఆర్థిక కష్టాలు

కరోనా వైరస్ కారణంగా ప్రపంచం అంతా ఆర్థిక ఇబ్బందులలో కూరుకు పోయింది.. కానీ ఆ ఆర్థిక ఇబ్బందులు కలియుగ దేవుడైన వెంకన్నకే వస్తాయని ఎవరు ఊహించి ఉండరు.
లాక్ డౌన్ కారణంగా హుండీ రాబడి లేకపోవడంతో వెంకన్నకు ఆర్థిక కష్టాలు మొదలయ్యాయి.. టీటీడీ ఏడాదికి రూ 1,385 కోట్లు కేవలం జీతాలు చెల్లిస్తుంది.
రోజుకి కనీస హుండీ రాబడి 3 నుంచి 4 కోట్లు ఉంటుంది.. లాక్ డౌన్ విధించి ఇప్పటికే 50 రోజులు.. ఇక ముందు కూడా ప్రజలు ఎప్పటిల వస్తారా అంటే అది ఇప్పటిలో జరిగే విషయం కాదు.. వీటిని దృష్టిలో పెట్టుకుంటే వెంకన్న రాబడికి గండి కాయం అని తెలుస్తుంది.. మరి అంత బారి మొత్తంలో జీతాలు చెల్లించడం కష్టం కాబట్టి కొత విధించడానికి టీటీడీ సిద్ధం అయ్యింది..
తిరుమల వెంకన్న పేరు మీద మీద ఉన్న బ్యాంకు డిపాజిట్ల రూపాన 700 కోట్ల రూపాయిలు ఆదాయం వస్తుంది.. ప్రస్తుతానికి వెంకన్న కు అంతకు మించి సంపాదన ఏది లేదు..