భారత ఎన్నికల సంఘం మాజీ ప్రధాన కమిషనర్ టిఎన్ శేషన్ కన్నుమూత

tn seshan passed away
tn seshan passed away

భారత ఎన్నికల సంఘం మాజీ ప్రధాన కమిషనర్ టిఎన్ శేషన్ (87) గుండెపోటు కారణంగా కన్నుమూశారు.

డిసెంబర్ 12, 1990 నుండి డిసెంబర్ 11 1996 వరకూ ఆయన ఎన్నికల సంఘం ప్రధాన కమిషనరగా పనిచేశారు. ఆయన అందించిన సేవలు ప్రజల గుండెల్లో చెరగని ముద్రవేశాయి. ఎన్నో కొత్త  సంస్కరణలు తెచ్చి ఎన్నికల కమిషన్ ను బలోపేతం చేశారు. నిష్పక్షపాతంగా ఎన్నికల నిర్వహణ, విధి నిర్వహణలో నిబద్దత , నిజాయితీ కి ఆయన మారు పేరు . 
ఎన్నికల సంఘం మాజీ ప్రధాన కమిషనర్ టిఎన్ శేషన్ మృతి పట్ల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.
కేంద్ర ఎన్నికల సంఘం మాజీ ప్రధాన అధికారి శ్రీ టి.ఎన్‌.శేషన్‌ మృతిపట్ల ముఖ్యమంత్రి  వైయస్‌.జగన్‌ సంతాపం వ్యక్తంచేశారు.