అభిమానులకు రజినీకాంత్ పిలుపు !!

  • Written By: Last Updated:
అభిమానులకు రజినీకాంత్ పిలుపు !!

తమిళ్ తలైవ సూపర్ స్టార్ రజినీకాంత్ పార్టీ పెట్టబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. తమిళనాడు రాజకీయాల్లో సినీ ప్రముఖులు మొదటి నుండి ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. త్వరలో ఎలెక్షన్స్ రానున్నాయి. ఎన్నో రాజకీయ పార్టీలు అధికారంలోకి రావాలని ఎప్పటినుండో గ్రౌండ్ వర్క్ చేస్తున్నాయి. సినిమా నటుడు రజినీకాంత్ కూడా ఎప్పటినుండో గ్రౌండ్ వర్క్ చేసిన్నట్లు, పార్టీ పెట్టబోతున్నట్లుగా తెలుస్తుంది. 2020 మార్చిలో కొత్త పార్టీ పెట్టాలని రజీనీ భావించాడు కానీ కరోనా కారణం గా పోస్ట్ పోన్ చేశారు. ఆతరువాత ఆగష్టు లో మరోసారి అవే వార్తలు రావడం కూడా జరిగింది. అప్పటికి దేశంలో ఇంకా పరిస్థితులు చక్కబడలేదు.

తాజాగా తలైవ నుండి ప్రకటన రావడం తో సర్వత్ర ఉత్కంట నెలకొన్నది. సోమవారం నాడు 30 మంది జిల్లా అధ్యక్షులు చెన్నై కి రావాలని పిలుపునిచ్చారు. అదే రోజు ఉదయం 9 గంటలకు రజినీకాంత్ జిల్లా అధ్యక్షులతో సమావేశం జరగన్నునది. రజినీకాంత్ పిలుపు మేరకు తమిళనాడు రాజకీయాలు హీట్ ఎక్కాయి. పలు రాజకీయనాయకులు ఇదే విషయంపై చర్చిచుకుంటున్నారు. ఈసారి రజినీకాంత్ పార్టీ పెట్టడం ఖాయం అని తెలుస్తుంది. ఎంతో మంది స్టార్స్ పార్టీ లు పెట్టి కొంత మంది హిట్ అయ్యారు మరికొందరు ఫ్లాప్ అయ్యారు. మరి తలైవ విషయంలో ఏం జరగబోతుందో చూడాలి.

follow us