2019 లో అడ్డం గా బోల్తా పడ్డ స్టార్ హీరోలు : దశాబ్దానికి సరిపడా నష్టం

  • Written By: Last Updated:
2019 లో అడ్డం గా బోల్తా పడ్డ స్టార్ హీరోలు :  దశాబ్దానికి  సరిపడా నష్టం

2019 టాలీవుడ్ బడా హీరోలకు చేదు అనుభవం మిగిల్చింది.. ఇరవైయో దశకం లోనే ఈ దశాబ్దానికి ఉన్న ప్లాపులు ఓ ఎత్తు  ఈ ఏడు సినిమాలు మూటకట్టుకున్న ప్లాపులు మరో ఎత్తు..

చిరంజీవి ప్రతిష్టాత్మకంగా చేసిన సైరా నరసింహారెడ్డి సినిమా .. స్వతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర మీద  తీసిన సినిమా నిర్మాత రామ్ చరణ్ కి వందల కోట్లు నష్టాలూ తెచ్చి పెట్టింది.. సురేందర్ రెడ్డి లాంటి ఒక దర్శకుడి చేతిలో ఇలాంటి ఒక స్వతంత్ర సమరయోధుడి కథ ను పెడితే ఎలా తీయగలడు అనుకున్నారో తెలియదు కానీ.. మెగాస్టార్ ఫ్యాన్స్ కానీ వాళ్ళకి మాత్రం అంత ఆశలు లేవు సినిమా మీద.. చిరంజీవి వేషధారణ కూడా చెప్పుకో దగ్గ బాగారాలేదు..కొణిదెల బ్యానర్ పెట్టిన ప్రతి రూపాయి మనకి కనిపిస్తుంది కానీ దాని తగ్గ ఫలితం మాత్రం సినిమా కి రాలేదు… మొత్తానికి ఇది ఈ ఏడు ఫ్లోప్స్ లో మొదటి స్థానం దక్కించుకుంటుంది..

బాహుబలి తరువాత ప్రభాస్ నటించిన సినిమా  సాహూ , బాహుబలి సినిమా తో ప్రభాస్ కు వచ్చిన విపరీతమైన క్రేజ్, ఫాలోయింగ్ మాములుగా అయితే తరువాత  సినిమాకి ప్లస్ గా మారుతాయి కానీ ఈ సినిమాకి మాత్రం నష్ఠాన్ని ఇచ్చాయి అనే చెప్పాలి.. కుర్ర దర్శకుడు సుజీత్ ఈ వత్తిడినంతా దృష్టి లో పెట్టుకొని సినిమా లో డబ్బులు మాత్రమే ఖర్చుపెట్టాడు.. ప్రతి సీన్ చాలా జాగ్రత్త గా చేసారు. కానీ ఇవి ఏవి సినిమాకి అనుకున్న ఫలితాన్ని ఇవ్వలేక పోయాయి.. ప్రభాస్ ముదురు  మొహం లా కనిపించాడు, ఫ్యాన్స్ కూడా ఇలా ఉన్నాదేంటి అనుకునేలాగా.. లీడ్ పెయిర్ మధ్య కెమిస్ట్రీ అసలు వర్క్ అవ్వలేదు.. ఈ సినిమా లో చెప్పుకోడానికి ఎ  లోపంలేని ఒక సీన్ లేదని చెప్పాలంటే అది ఒక పాట ‘బ్యాడ్ బాయ్’ పాట మాత్రమే..

బాలకృష్ణ.. ఈ నందమూరి కథానాయకుడు సినిమాలు మనం అసలు వేరే గా  చెప్పుకోవాలి.. నందమూరి తారక రామ రావు బయోపిక్ అంటూ 2019 మొదటి లోనే భయంకరమైన డిజాస్టర్ ముటకట్టుకున్నాడు..అక్కడితో వదిలేయకుండా మళ్ళీ  చివరిలో కూడా రూలర్ అని అంటూ ఇంకో డిజాస్టర్.. అబ్బో ఈ సినిమా ఫైట్స్ డ్యాన్సులూ ఎమోషన్ అదరకొట్టారు ప్రేక్షకులు చూడలేనంతగా ..

నాగార్జున , ఎప్పుడో వచ్చింది మన్మధుడు దానిని అలా వదిలేయకుండా అరవై ఏళ్ళ వయసు లో ఇరయై ఏళ్ళ కుర్రాడిలా మళ్ళీ రొమాన్స్ చేయడానికి రెడీ అయ్యిపోయాడు .. అది కూడా అబ్బో ఈయన ముందు కుర్ర హీరోలు ఎందుకు పనికి రారు అనుకునేల  ‘ఏ ‘ సరిఫికేట్ సినిమా తీసాడు.. అప్పటి దాకా ఆయనకి ఉన్న ఫ్యామిలీ ఆడియన్స్ ఒక్కసారి గా దూరం అయ్యారు.. ఇద్దరు కొడుకులు హీరోలు కోడలు కూడా వచ్చింది అయినా కానీ మన తెలుగు సినిమా హీరో హాలీవుడ్ రేంజ్ లో ఫీల్ అయ్యాడు ఏమో కానీ రొమాన్స్ సె** అంటూ అసలు అబ్బో చెప్పడానికి కూడా కుదరని తరహా లో తీశారు మన్మధుడు 2.. బాక్స్ ఆఫీస్ దగ్గర అడ్డం గా బోల్తా పడింది సినిమా..

అసలు స్టార్ హీరోలు ఏమి అనుకుంటారు.. వాళ్ళు ఏమి చేసిన ప్రేక్షకులు చూస్తారు అనుకుంటారా? లేక పోతే వాళ్ళ ఇష్టాలని జనల మీద రుద్దానికి ప్రయత్నిస్తారు?

2020 లో అయినా కానీ మన ఈ ముసలి సీనియర్ హీరోలు హిట్టులు కొట్టాలని.. వాళ్ళ వయసుకు హుందా తనానికి తగ్గ సినిమా లు తీయాలని.. అలానే ఒక కళాఖండం ఎలా తీసిన ప్రేక్షకులు చూడరు.. హీరోల క్రేజ్ మీద సినిమాలు ఆడే  రోజులు పోయాయి.. సినిమా బాగుండాలి.. సినిమా సందేశం లేక పోతే ఎమోషన్ లేక పోతే కామెడీ దృష్టి లో పెట్టుకొని బడ్జెట్ తో సహా అన్ని జాగ్రత్త చూసుకొని తెస్తే  వచ్చే ఇయర్ మన ఈ హీరోలు హిట్టు కొట్టాలని ఆశిద్దాం. 

Tags

follow us

Web Stories