డ్రగ్స్ కేసు: టాలీవుడ్ నటి అరెస్టు

సుశాంత్‌సింగ్ కేసులో భాగంగా బయటపడ్డ డ్రగ్స్ కేసు మొన్నటి వరకూ బాలీవుడ్‌లో కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. అది ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఇదిలా ఉండగానే.. ముంబయిలోని మిరా రోడ్డులో ఉన్న ఓ హోటల్‌లో ఎన్‌సీబీ అధికారులు సోదాలు చేశారు. ఈ క్రమంలో డ్రగ్స్ విక్రయిస్తున్న వ్యక్తితో పాటు ఓ టాలీవుడ్ నటిని అదుపులోకి తీసుకున్నారని సమాచారం.
రూ. 10 లక్షల విలువైన డ్రగ్స్ సీజ్ చేశారు అధికారులు. చాంద్ అనే వ్యక్తితో పాటు టాలీవుడ్ నటిని కూడా అరెస్ట్ చేశారు ఎన్సీబీ అధికారులు. అయితే.. ఈ నటి ఎవరనేది అందరిలోనూ ఆసక్తి రేపుతోంది. టాలీవుడులో పలు సినిమాల్లో ఆ నటి యాక్ట్ చేసినట్లు తెలుస్తోంది. అయితే.. ఆ నటి పేరు ఎన్సీబీ అధికారులు మీడియా వెల్లడిస్తారా ? లేదా ? అనేది తెలియాల్సి ఉంది.
Related News
పండక్కి.. బాబాయ్ తో అబ్బాయ్
2 years ago
పెళ్లిపై రామ్ ఇస్మార్ట్ సమాధానం
2 years ago
అనౌన్స్: పవన్ కు రెండోసారి మాటలు రాస్తున్న త్రివిక్రమ్
2 years ago
నేడు ప్రారంభమైన ‘సలార్’.. హీరోయిన్ గా ?
2 years ago
మహేష్ కోసం.. మారిపోయిన మహానటి లుక్
2 years ago