జి‌హెచ్‌ఎం‌సి ఎన్నికల్లో సినీ తారల సందడి

జి‌హెచ్‌ఎం‌సి ఎన్నికల్లో సినీ తారల సందడి

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నేడు ఎన్నికలు జరుగుతున్నాయి. అధికార, ప్రతిపక్ష పార్టీలు తమకే ఓట్ వెయ్యాలని పెద్ద పెద్ద మైక్ లు వేసుకుని మరి ప్రచారం నిర్వహించాయి. ఓటు హక్కు మనందరి బాద్యత ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలని పలువురు సినిమా పరిశ్రమకు చెందిన నటి, నటీమణులు, నిర్మాతలు, రచయతలు చెప్పుతున్నారు.

చిరంజీవి, నాగార్జున ఆయన భార్య అమల తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వారు ఓటు వేసిన తర్వాత తమ వేలికి అంటించిన ఇంక్ మార్క్ చూపుతూ ఫోటో కు ఫోజ్ ఇచ్చారు. రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని తెలిపారు.

నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ మాట్లాడుతూ: ప్రతి ఒక్కరు ఓటు వెయ్యండి … మంచి వాడిని ఎన్నుకుని అతడికి ఓటు వెయ్యండి. రాజకీయనాయకులను ప్రశ్నించే తత్వం ఒక్క ఓటు హక్కు ద్వారానే వస్తుందని అన్నారు

సుడిగాలి సుధీర్: ఓటు హక్కు అనేది రాజ్యాంగం మనకు కల్పించిన గొప్పవరం. ఓటు ఉన్న ప్రతి ఒక్కరు ఆ హక్కును వినియోగించుకోవాలని అన్నాడు.

సుద్దాల అశోక్ తేజ్: ఓటు హక్కు పై అవగాహన కొరకు తనదైన శైలిలో పాట రూపంలో వివరించాడు. వోటింగ్ డే అంటే మనకు హాలిడే కాదు అని ఓటు హక్కు రాజ్యాంగం మనకు ఇచ్చిన గొప్ప వరం. చేజార్చుకొకు ఆ అవకాశం. గ్రేటర్ హైదరాబాద్ లో వోటరే కదా బాహుబలి అంటూ పాడి మరి వినిపించారు.

దర్శకుడు శేకర్ కమ్ముల: మన హైదరాబాద్.. అప్నా సిటి… అప్నా హైదరాబాద్ అంటూ ..మనం నిజంగా మన సిటిని ప్రేమిస్తే ప్రతి ఒక్కరు ఓటు వెయ్యాలని అప్పుడే మంచి పాలన వస్తుందని అన్నాడు.

యాంకర్ ఉదయభాను: ప్రలోభలకు లొంగకుండా ప్రగతి కోసం ఓటు వేద్దామ్ అన్నారు.

సుమ: ఓటు మన ఉనికి, మన బాద్యత, రాజ్యాంగం మనకు ఇచ్చిన హక్కు దాన్ని మనం వినియోగించుకుందాం అని అన్నారు.

ప్రియదర్శి నటుడు: ఈ‌ నగరంలో పుట్టినందుకు నేను గర్వపడుతున్నాను. హైదరాబాద్ విశ్వ నగరంగా తీర్చిదిద్దే భాద్యత ప్రతి ఒక్కరు పైన ఉన్నది. ఓటు ఉన్న ప్రతి ఒక్కరు తమ కర్తవ్యంగా ఓటు హక్కు వినియోగించుకోవాలి అన్నారు.

follow us