నిర్మాతలపై ఒత్తిడి తెస్తున్నడిస్ట్రిబ్యూటర్స్

నిర్మాతలపై ఒత్తిడి తెస్తున్నడిస్ట్రిబ్యూటర్స్

కరోనా కారణంగ థియేటర్స్ గత ఎనిమిది నెలలు గా మూత పడ్డాయి. దేశంలో కాస్త పరిస్థితులు చక్కబడటంతో కేంద్ర ప్రభుత్వం మూసిన థియేటర్స్ ను తెరవడానికి అనుమతి ఇచ్చింది. ఈ నెల 25 నా సాయి దరమ్ తేజ్ నటించిన సోలో బ్రతుకే సొ బెటర్ థియేటర్స్ లో విడుదల అవ్వుతున్న మొదటి చిత్రం. ప్రతి సంక్రాంతి సమయంలో పోటీ పడి మరి సినిమాలను విడుదల చేస్తారు. కానీ ఈసారి ఆ పరిస్థితి కనిపించడం లేదు. వచ్చే ఏడాది సంక్రాంతి భరీలో పోటీ పడేందుకు రామ్ “రెడ్”, మెగా ఫ్యామిలీ హీరో వైష్ణవ్ తేజ్ నటించిన “ఉప్పెన”, పవన్ కళ్యాణ్ “వకీల్ సాబ్” చిత్రాలు సిద్దంగా ఉన్నాయి కానీ.. ఆ చిత్రా నిర్మాతలు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన 50 శాతం ఆక్యుపెన్సీ తో విడుదల చేసేందుకు సిద్దంగా లేరు.

ఈ విషయంపై టాలీవుడ్ పంపిణీదారులు మాత్రం నిర్మాతలపై ఒత్తిడి తెస్తున్నారు. థియేటర్స్ మూసివెయ్యడంతో అప్పులు ఆర్థిక సక్షోభంలో యజమానులు ఉన్నారు. ఇచ్చిన 50 శాతం ఆక్యుపెన్సీ తో అయిన సరే సంక్రాంతికి సినిమాలను విడుదల చేసి.. అదనపు షో లు వెయ్యడం… టికెట్ రేట్స్ పెంచడం వలన డబ్బు సంపాదించవచ్చు అని టాలీవుడ్ నిర్మాతలపై డిస్ట్రిబ్యూటర్స్ ఒత్తిడి తెస్తున్నారు… ఈ సంక్రాంతి మిస్ అయితే మాత్రం థియేటర్ లకు కోలుకోలేని దెబ్బ పడుతుంది అంటున్నారు. త్వరలోనే ఈ విషయంపై నిర్మాతలు చర్చించి ఓ నిర్ణయం తీసుకుంటాం అంటున్నారు.

follow us