ఫిలింక్రిటిక్స్ సంక్షేమానికి నిర్మాతల సాయం

  • Written By: Last Updated:
ఫిలింక్రిటిక్స్ సంక్షేమానికి నిర్మాతల సాయం

ఫిలింక్రిటిక్స్ అసోసియేష‌న్ కి మెగాస్టార్ చిరంజీవి ఆశీస్సులు స‌భ్యుల్లో ఉత్సాహం నింపిన సంగ‌తి తెలిసిందే. అసోసియేష‌న్ స‌భ్యుల హెల్త్ కార్డ్స్ మరియు గోల్డెన్ జూబ్లీ వేడుకలు ఇత‌ర‌ సంక్షేమ కార్య‌క్ర‌మాల కోసం క‌మిటీ కృషి చేస్తోంది. తాజాగా బుధవారం ఉదయం ప్రముఖ దర్శకులు సురేందర్ రెడ్డి చేతుల మీదుగా ఉలాలా ఉలాల నిర్మాత‌ గురురాజ్ ఒక లక్ష రూపాయలు అలాగే తిప్ప‌ర మీసం హీరో శ్రీవిష్ణు సమక్షంలో నిర్మాతలు రిజ్వాన్ మరియు అచ్యుత రామారావు ఫిలింక్రిటిక్స్ సంక్షేమానికి రెండు లక్షల రూపాయలు సాయం అందించారు. వారి స‌హాయానికి ఫిలింక్రిటిక్స్ అధ్య‌క్షుడు సురేష్ కొండేటి, మరియు ప్రధాన కార్యదర్శి ఇ.జ‌నార్థ‌న్ రెడ్డి ధ‌న్య‌వాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసెంట్ వాసు, ట్రెజరర్ భూషణ్ తదితరులు పాల్గొన్నారు

Tags

follow us