షూటింగులకు కేసీఆర్ గ్రీన్ సిగ్నల్

tollywood to resume shooting for june 2020
tollywood to resume shooting for june 2020

టాలీవుడ్ ప్రముఖులు గత రెండు రోజుల నుండి సినిమాటోగ్రఫి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తో చిరంజీవి నివాసంలో సమావేశం అయ్యారు , నిన్న జరిగిన సమావేశంలో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ చేసుకోవచ్చని ప్రకటించిన సంగతి తెలిసిందే. 
సినిమా హాళ్లు ఓపెన్ ఎప్పుడు చేయాలి , షూటింగుల జరుపుకోవడానికి పర్మిషన్ కోసం సీఎం కేసీఆర్ తో సినీ ప్రముఖులు సమావేశమయ్యారు, ఈ సమావేశంలో ఇన్డోర్ షూటింగ్స్ , తక్కువ మందితో లాక్ డౌన్ నిబంధనలను , కరోనా వ్యాప్తి నివారణ మార్గదర్శకాలు పాటిస్తూ చేసుకోవచ్చని సీఎం కేసీఆర్ చెప్పారు. షూటింగ్ నిర్వహించే విధి విధాలను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. 

జూన్ నెలలో షూటింగ్స్ జరుపుకోవచ్చని , పరిస్థితి ని బట్టి థియేటర్స్ ఓపెన్ చేయడంపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. 

కేసీఆర్ సమావేశం, సంబంధించిన సమస్యలు సానుకూలంగా విని, వేలాది మంది దినసరి వేతన కార్మికులకు ఊరట కలిగేలా త్వరలో నిర్ణయం తీసుకుంటామని తెలిపినందుకు సినీ ప్రముఖులు సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు