అనిల్ రావిపూడి తో సినిమా అంటే హీరోలు భయపడుతున్నారా ?

దర్శకుడు అనిల్ రావిపూడి ఇప్పటి వరకు ఒక ప్లాప్ అనేది కూడా చూడలేదు.. F2, సరిలేరు నీకెవ్వరు ఆఖరికి ప్లాప్ లతో కొట్టు మిట్ట ఆడుతున్న రవి తేజ కు కూడా రాజా ది గ్రేట్ సినిమాతో  హిట్ ఇచ్చాడు.. అలాంటి ఒక దర్శకుడికి ఇప్పుడు సినిమా లేదు ..

ఇండస్ట్రీ లో అనిల్ రావిపూడి అంటే పక్కా కమర్షియల్ దర్శకుడనే మార్క్ ఉంది.. డబ్బులు పెడితే మినియం గ్యారెంటీ కంఫర్మ్ .. కానీ అలాంటి ఒక దర్శకుడు చేతులో సినిమా లేక పోవడం ఏంటి అని అనుకుంటే అది ఆయన సినిమా తీసే పంధా నే.. 
పటాస్, సుప్రీమ్ , రాజా ది గ్రేట్ ఇలా అన్ని వేరే వేరే ఫార్ములా తో సినిమా తీసి శభాష్ అనిపించుకున్న అనిల్ కు కష్టాలు తప్పడం లేదు ఆయన ఫార్ములాతో ..  F 2 బంపర్ హిట్ అయినా కానీ ఒక వర్గం ప్రేక్షకులకు నచ్చలేదు.. ఇప్పుడు మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు  సినిమా కూడాఅంతే .. ఒక వర్గం ప్రేక్షకులకు అసలు నచ్చలేదు.. ప్లాప్ అయితే కాలేదు కానీ సినిమా మాత్రం మహేష్ బాబు వల్లనే బాక్స్ ఆఫీస్ దగ్గర నిలబడింది అని చెప్పడానికి ఆలోచించనవసరం లేదు..

మరి ఇలా తన క్వాలిటీ అఫ్ మేకింగ్ ని తగ్గించుకుంటూ వస్తున్న దర్శకుడు చేతికి ఎవరు సినిమా ఇస్తారు.. F 3 తీద్దాం అని అనుకున్న అది వర్క్ అవుట్ కాలేదు. 
ప్రస్తుతానికి.. హీరోలు అందరూ చేతి నిండా సినిమాలతో బిజీ గా ఉన్నారు..అనిల్ చేతిలో తీసుకు వచ్చి సినిమా పెట్టడం అంటే 90% రిస్క్ చేయడమే..ఇలాంటి సమయంలో ఇంకా చేసేది ఏమి లేక ఖాళీగానే ఉన్నారు.. కుదిరితే బాలకృష్ణ తో ఆగిపోయిన “రామారావుగారు ” సినిమా ను మళ్ళీ మొదలు పెట్టే ఆలోచనలో ఉన్నాడు అనిల్ రావిపూడి అని తెలుస్తుంది..

ఒక ప్లాప్ కూడా లేని దర్శకుడికి ఆయన ఫార్ములా వల్ల చేతిలో సినిమాలు లేకుండా పోయాయి..