సాధారణ ప్రజలు వేసుకునే దుస్తులు వెయ్యో..రెండు వేలో ఉంటాయి. చెప్పులు ఐదు వందల నుండి వెయ్యి వరకు ఉండొచ్చు. కానీ సెలబ్రెటీలు వేసుకునే దుస్తులు, చెప్పులు, బ్యాగులు ఇలా దేని ధర చుసినా సామాన్యుడికి దిమ్మ తిరగాల్సిందే. బట్టలు, బ్యాగుల ధరలు పదివేల నుండి లక్షల్లో ఉంటున్నాయంటే నమ్మాల్సిందే. ఒకవేళ నమ్మలేకపోతే గూగుల్ తల్లిని అడిగినా చెప్పేస్తుంది.
ఇక ప్రస్తుతం సెలబ్రెటీలు ధరించే యాక్ససరీస్ బ్రాండ్లు వాటి ధరలు సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి. తాజాగా హీరోయిన్ త్రిష దర్శించిన బట్టలు, యాక్ససరీస్ ధర సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నిజానికి త్రిష ధరించిన డ్రెస్ చాలా సింపుల్ గా కనిపిస్తోంది. చెక్స్ షర్ట్, సైడిల్స్, ఓ బ్యాగు వాటి ధరే అన్ని కలిపి 2 లక్షలకు పైనే ఉంది. కేవలం బ్యాగు ధరే 2 లక్షల 19వేలు,ఇక చెప్పుల ధర 33వేలు , షర్ట్ ధర 3వేల పైనే ఉంది. ఇక సోషల్ మీడియాలో త్రిష ధరించిన వాటి ధర చూసి షాక్ అవుతున్న నెటిజన్లు ఇవేమైనా బంగారం తో కానీ చేసారా..? ఏముంది వాటిలో.? అని షాక్ అవుతున్నారు. ఎంతైనా సెలబ్రెటీలు కోట్లల్లో సంపాదిస్తున్నారు. కాబట్టి అది వారికి తక్కువే అని మరికొందరు అనుకుంటున్నారు.