14 ఏళ్ల తర్వాత విజయ్ కి జోడిగా నటించబోతున్న బ్యూటీ

14 ఏళ్ల తర్వాత విజయ్ కి జోడిగా నటించబోతున్న బ్యూటీ

తమిళ్ హీరో విజయ్ కి జోడిగా 14 ఏళ్ల తర్వాత త్రిష నటించబోతుంది. ‘ 2014లో ‘గిల్లి’ అనే చిత్రంలో వీరిద్దరూ జోడి కట్టారు. ఈ మూవీ సంచలన విజయం సాధించింది. మళ్లీ ఇప్పుడు ఈ జంట జోడి కట్టబోతుంది. విజయ్ – లోకేష్ కనకరాజ్ కలయికలో ఓ సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్టుకు ‘దళపతి 67’ అని వర్కింగ్ టైటిల్ పెట్టారు. సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ నిర్మించనుంది.

డిసెంబర్ 5న చెన్నైలోని ఏవీఏమ్ స్టూడియోస్‌లో ఈ సినిమాను లాంచ్ చేశారు. లాంచింగ్ ఈవెంట్‌లో మీడియాపై ఆంక్షలు విధించారు. ఫొటోలు లీక్ కాకుండా చర్యలు తీసుకున్నారు. ఇక కమల్ తో ‘విక్రమ్’ సినిమా చేసి లోకేష్ మంచి పాపులారిటీ సంపాదించుకున్నాడు. పాన్ ఇండియా వ్యాప్తంగా అభిమానులకు చేరువయ్యాడు. ‘దళపతి 67’ ను కూడా లోకేశ్ సినిమాటిక్ యూనివర్స్‌గా తెరకెక్కించబోతున్నాడు.

follow us