‘ఉస్తాద్ భగత్ సింగ్’ లో త్రివిక్రమ్ హస్తం..?

పవన్ కళ్యాణ్ – హరీష్ శంకర్ కలయికలో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ అనే మూవీ రాబోతున్న సంగతి తెలిసిందే. గతంలో హరీష్ – పవన్ కలయికలో గబ్బర్ సింగ్ మూవీ వచ్చి భారీ విజయం అందుకోవడమే కాదు పవన్ కళ్యాణ్ కెరియర్ లోనే ఓ మైలురాయి చిత్రంగా నిలిచింది. ఇప్పుడు మరోసారి వీరిద్దరి కాంబో లో సినిమా అనగానే అంచనాలు తారాస్థాయికి చేరాయి. ముందుగా ఈ చిత్రానికి ‘భవదీయుడు భగత్ సింగ్’ అనే టైటిల్ ఖరారు చేసారు. అయితే మళ్లీ ఏమైంది కానీ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గా చేంజ్ చేసి పూజా కార్యక్రమాలు పూర్తి చేసారు.
ఇక ఇదిలా ఉంటే ఈ మూవీ కథ విషయంలో త్రివిక్రమ్ హస్తం కలిపారనే వార్త సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతుంది. హరీష్ రాసిన స్ర్కిప్ట్ అంతా బాగున్నప్పటికీ కొన్ని లాజిక్ లు విషయంలో సింక్ అవ్వకపోవడంతో పవన్ గురూజీ ని దించారని…. ఆ తర్వాత ఇద్దరు ఓ మాట అనుకుని కథలో అవసరమైన మార్పులు చేశారట. అయితే డైలాగుల విషయంలో హరీష్ కి పూర్తి స్వేచ్ఛ ఇచ్చారుట. ఈ విషయంలో ఎక్కడా త్రివిక్రమ్ వేలు పెట్టలేదని తనకి నచ్చిన విధంగా సంభాషణలు రాసుకునే వెసులు బాటు కల్పించారని అంటున్నారు. మరి ఈ వార్త ఎంత వరకు నిజమో తెలియాల్సి ఉంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవి శ్రీ మ్యూజిక్ అందిస్తున్నాడు.