ఏదీ చేసినా హ్యాపీగా చేద్దాం సార్ అని అన్నాడు.

ఏదీ చేసినా హ్యాపీగా చేద్దాం సార్ అని అన్నాడు.

స్టార్ డైరెక్ట‌ర్ త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ మ్యూజిక్ కన్సర్ట్ జరుపుకుంటున్న సందర్భంగా మాట్లాడుతూ – “ఓ రూమ్‌లో మ‌ధ్యాహ్నం 3-4 గంట‌ల ప్రాంతంలో పెద్ద‌గా ట్రాఫిక్ లేని స‌మ‌యంలో 30 ఏళ్ల యువ‌కుడు, 60 ఏళ్ల పెద్దాయ‌న కూని రాగం తీసుకుంటూ రాసిన పాట కొన్ని కోట్ల మంది హృద‌యాల‌ను తాకింది. అదే సామ‌జ‌వ‌ర‌గ‌మ‌న. త‌న వ‌య‌సు నుంచి దిగి ఆయ‌న‌, త‌న వ‌య‌సును ఎక్కి త‌మ‌న్ క‌లిసి ఓ కామన్ పాయింట్‌ను క‌లిపి ఈ చిత్రానికి స్థాయిని తీసుకొచ్చారు. మా గుండెలు ప‌ట్ట‌నంత ఆనందాన్ని మీకు వినిపించేయాలి.. మా క‌ళ్ల‌ల్లో వ‌చ్చిన నీటి చుక్క మీ అంద‌రి క‌ళ్ల‌ల్లోకి ఎలా రావాలి. ఓ సాయంత్రం కారులో వెళ్లే అబ్బాయి త‌న ప్రేయ‌సి గుర్తు తెచ్చుకుంటూ.. అలాగే సాయంత్రం త‌న‌ను చూస్తున్న యువ‌కుడిని చూడ‌న‌ట్లు న‌టిస్తూ త‌న హెడ్ ఫోన్స్‌లో విన‌డానికి ఒక అత్య‌ద్భుత‌మైన క‌ళ్ల‌ని, ఒక జ్ఞాప‌కాన్ని ఇద్ద‌రూ మ‌న‌కు ఇచ్చారు. దానికి త‌న‌కు గొంతునిచ్చి సిద్ శ్రీరామ్ ఈ పాట‌ను మ‌న అంద‌రి గుండెల్లోకి తీసుకొచ్చేశాడు. ఓ పాట మ‌న‌కు ఊతం చేయి ప‌ట్టుకుని న‌డ‌వొచ్చు.. ఓ పాట మ‌న‌కు స్నేహితురాలు మ‌న క‌ష్టాలు చెప్పుకోవచ్చు. అది మ‌న ప్రేయ‌సి త‌న ఒళ్లో మ‌న త‌లను పెట్టుకుని ప్రేమ‌ను పొంద‌వ‌చ్చు.

మ‌న గురువు.. మ‌న‌కు అవ‌స‌రం వ‌చ్చిన‌ప్పుడు మ‌న‌కు జ్ఞానాన్ని బోధిస్తుంది అలాంటి పాట‌ను ఇచ్చిన వారిని గౌర‌వించాల‌నిపించింది. అందుకే దీనికి మ్యూజిక‌ల్ నైట్ పేరు పెట్టి కండ‌క్ట్ చేశాం. ఈ కోరిక‌ను బ‌లంగా మ‌న ముందుకు తీసుకొచ్చింది అల్లు అర్జున్‌. జులాయిలో పెళ్లి కానీ అబ్బాయిగా తెలుసు. ఇప్పుడు ఇద్ద‌రి పిల్ల‌ల తండ్రిగా త‌న తాలూకు మెచ్యూరిటీని త‌న మాట‌లు, జీవితంలో, ప‌నిలో ప్ర‌తి దాంట్లో పెడుతున్నాడు. మేం క‌నే క‌ల మీ అంద‌రికీ మంచి జ్ఞాప‌కం కావాలి. దీని కోసం మేం ఎంత అడ్వేంచ‌రెస్‌గా నిర్ణ‌యాలు తీసుకున్నా, మీ వెనుక మేం ఉన్నామంటూ అర‌వింద్‌గారు, చిన్న‌బాబుగారు నిల‌బ‌డి మేం అడిగిదానల్లా గొప్ప‌గా ఇచ్చారు. ఇంత గొప్ప సంగీతాన్ని అందించిన ప్ర‌తి ఒక్క‌రికీ మ‌న‌స్ఫూర్తిగా నా ఆశీస్సులు అందిస్తున్నాను. అలాగే ఈ సినిమాలో ప‌నిచేసిన ప్ర‌తి ఒక్క‌రూ ఏదో ర‌కంగా మ‌న‌సుకు ద‌గ్గ‌రైన వాళ్లే. వాళ్లంద‌రికీ నేను చెప్పే మాట ఒక‌టే.. వాళ్లంద‌రితో నేను ప్రేమ‌లో ఉన్నాను.

ఈ సినిమా రిలీజ్ త‌ర్వాత కొద్దిపాటి విర‌హాన్ని అనుభ‌విస్తాను. మ‌ళ్లీ ఓ క‌థ‌ను రాస్తాను. మ‌ళ్లీ మిమ్మ‌ల్ని క‌లుస్తాను. ఈ సినిమాకు మొద‌లు, చివ‌ర అల్లు అర్జునే. ఈ సినిమా గురించి మాట్లాడుకుంటున్న‌ప్పుడు ఏదీ చేసినా హ్యాపీగా చేద్దాం సార్ అని అన్నాడు. అప్ప‌టి నుండి 11 నెల‌లు పాటు ఈ జ‌ర్నీ చేశాం. మేం కాకినాడ‌లో షూటింగ్  చేస్తున్న‌ప్పుడు పాట‌ల లిరిక‌ల్ వీడియోలు రొటీన్‌గా ఉన్నాయి. పాట కోసం ప‌నిచేసి టెక్నీషియ‌న్స్ క‌నిపించేలా ఏదైనా కొత్త‌గా చేద్దామ‌ని ఆయ‌న అన్నారు. అదే మీరు చూసిన సామ‌జ‌వ‌ర‌గ‌మ‌న పాట‌.. అలా నాతో స‌హా అంద‌రినీ ఎంతో ఇన్‌స్పైర్ చేశారు.

ఆయ‌న లైఫ్‌లో ఇంకా చాలా ముందుకు వెళ్లాల‌ని కోరుకుంటున్నాను. ఆ ప్ర‌యాణంలో మేం కూడా భాగ‌మ‌వుతాం. మేం ప‌నిచేయ‌లేని సినిమాల‌కు మేం సాక్షుల‌మ‌వుతాం, ప్రేక్ష‌కుల‌మ‌వుతాం. మేం ప‌నిచేసే సినిమాల‌కు ద‌ర్శ‌కుల‌మ‌వుతాం. అంద‌రి ప్రేమ మాపై ఇలాగే ఉండాలి. 12న క‌లిసి పండ‌గ చేసుకుందాం. ఆనందంగా ఉంది. అల వైకుంఠ‌పుర‌ములో మీకు స్వాగతం ప‌లుకుతుంది“ అన్నారు.

follow us

Web Stories