త్రివిక్ర‌మ్ అడ్వాన్స్ వ‌డ్డీతో స‌హా క‌ట్టాల్సిందేన‌ట‌..!

trivikram to be paid interest
trivikram to be paid interest

ప్ర‌స్తుతం ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమాలో న‌టిస్తున్నారు. ఈ సినిమా త‌ర‌వాత ఎన్టీఆర్ త్రివ‌క్ర‌మ్ దర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేస్తార‌ని ఎప్పటి నుండో వార్త‌లు వ‌స్తున్నాయి. దాదాపు ఇది ఖ‌రార‌య్యింది కూడా. అయితే ఇప్పుడు త్రివిక్ర‌మ్ మ‌హేశ్ బాబు తో కొర‌టాల ఎన్టీఆర్ తో సినిమా చేయాల‌ని అగ్రింమెంట్ చేసుకున్నార‌ట‌. దాంతో ముందుగా అనుకున్న త్రివిక్ర‌మ్ ఎన్టీఆర్ సినిమా ఆగిపోవ‌డంతో ఇప్పుడు మాట‌ల మాంత్రికుడు వ‌డ్డీతో స‌హా అడ్వాన్సును తిరిగిచ్చేయాల‌ట. నిజానికి ఎన్టీఆర్ త్రివిక్ర‌మ్ సినిమాను హారిక హాసిని క్రియేష‌న్స్ బ్యాన‌ర్ నిర్మిస్తోంది. అది సొంత సంస్థే దాంతో అక్క‌డ త్రివిక్ర‌మ్ ఆడ్వాన్స్ తిరిగివ్వాల్సిన అవ‌స‌రం లేదు.

కానీ ఈ ప్రాజ‌క్టులో ఎన్టీఆర్ట్స్ కూడా బాగ‌స్వామ్యం అయింది. దాంతో క‌ల్యాణ్ రామ్ కూడా నిర్మాత లిస్ట్ లో చేరారు. అయితే క‌ల్యాణ్ రామ్ త్రివిక్ర‌మ్ కు రూ. 1కోటి అడ్వాన్స్ గా ఇచ్చార‌ట‌. దాంతో ఇప్పుడు ఆ డ‌బ్బును వ‌డ్డీతో స‌హా తిరిగి ఇవ్వాల‌ని క‌ల్యాణ్ రామ్ డిమాండ్ చేస్తున్నార‌ట‌. కోటి రూపాయ‌లు ఇవ్వ‌డం త్రివిక్ర‌మ్ కు పెద్ద లెక్క కాదు కానీ అడ్వాన్స్ తో స‌హా తిరిగి ఒక బడా డైరెక్ట‌ర్ ను తిరిగి ఇవ్వమన‌డం ఫిల్మ్ న‌గ‌ర్ లో చ‌ర్చ‌గా మారింది. అంతే కాకుండా త్రివిక్ర‌మ్ అడ్వాన్స్ తిరిగి ఇవ్వాల్సిన ప‌రిస్థితి రావ‌డం కూడా ఇదే మొద‌టి సారి కావ‌చ్చు.