మోడీ కి ట్రంప్ వార్నింగ్ ఇచ్చిన వేళ

హైడ్రాక్సి క్లోరోక్విన్, మరియు ఇతర 26 ఔషధాల తయారీ లో వాడే ముడి పదార్ధాల ఎగుమతులపై భారత్  నిషేధం విధించిన సంగతి తెలిసిందే.. అయితే దీనికి ప్రతి చర్యలు ఉంటాయని ట్రంప్ హెచ్చరించారు.  వైట్ హౌస్ సాక్షిగా ఈ హెచ్చరికలతో మెత్త పడ్డ మోడీ.. “  నిన్న ప్రధాని మోడీతో ఫోన్ లో మాట్లాడాను. ఎగుమతులపై నిషేధం ఎత్తివేయాలని కోరాను. చూద్దాం, ఏమైతుందో ”, అని వ్యాఖ్యానించిన ట్రంప్. 

ప్రపంచ ఉత్పత్తి చేసే “జెనెరిక్ మందుల 4 వంతు భారత్ ఉత్పత్తి చేస్తోంది.  ఇరుగుపొరుగు దేశాలతో పాటు, బాగా అవసరమైన ఇతర దేశాలకు కూడా “హైడ్రాక్సి క్లోరోక్విన్” మరియు “పారాసెటామోల్” లాంటి ఔషధాల ఎగుమతులపై పాక్షికంగా ఆంక్షలను ఎత్తివేసేందుకు భారత్ నిర్ణయం తీసుకుంది.

“హైడ్రాక్సి క్లోరోక్విన్” లాంటి ఔషధాల నిల్వలను ఎప్పటికప్పుడు చూసుకుంటూ, ఆయా కంపెనీలు గతంలో చేసుకున్న ఒప్పందాల ప్రకారం మనకి కావాల్సిన వనరులు చూసుకుంటూ సరఫరా చేసేందుకు అనుమతిస్తామని భారత్ ప్రకటన చేసింది.