కంగనాకు ట్విట్టర్ షాక్..!

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ కు ట్విట్టర్ షాక్ ఇచ్చింది. కంగనా రనౌత్ అధికారిక ఖాతాను శాశ్వతంగా సస్పెండ్ చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. కంగనా రనౌత్ రెచ్చగొట్టే పోస్టులను పెడుతున్నందుకు ఆమె ఖాతాను తొలగిస్తున్నట్టు ట్విట్టర్ తెలిపింది. కాగా కంగనా ప్రస్తుతం జరుగుతున్న బెంగాల్ అల్లర్లపై వరుసగా పోస్టులను పెడుతుంది. దాంతో ఆ ఆపోస్ట్లు రెచ్చగొట్టే విధంగా ఉన్నాయన్న నేపథ్యంలో ట్విట్టర ఈ నిర్ణయం తీసుకుంది. ఇక తన ఖాతాను తొలగించడంపై ఫైర్ బ్రాండ్ స్పందించింది. ట్విట్టర్ అమెరికన్లకు చెందినదని… తెల్ల రంగు కలిగిన వాళ్లు ఎప్పుడూ గోదుమరంగు చర్మం కలిగినవాళ్లని నియంత్రించాలని చూస్తుంటారని పేర్కొంది.
ఏం మాట్లాడోలో ఏం మాట్లాడకూడదో కూడా వాళ్లే డిసైడ్ చేస్తారని కంగనా పేర్కొంది. ఇప్పుడు తనకు ట్విట్టర్ గురించి ఒక పూర్తి అవగాహన వచ్చిందని తెలిపింది. అదృష్టవశాత్తు తన గొంతు వినిపించడానికి ఇతర వేధికలు ఉన్నాయని తెలిపింది. అంతే కాకుండా సినిమాల ద్వారా తన కళ ద్వారా గొంతును వినిపిస్తానని కంగనా రనౌత్ వెల్లడించింది. ఇక కంగనా రనౌత్ సినిమాల కంటే వివాదాలతోనే ఎక్కువగా బిజీ ఉంటుంది. ఆమెపై కొన్ని వేల ఎఫైఆర్ లు నమోదయ్యాయని ఇటీవల ఓ ఇంటర్యూలో వెల్లడించింది.