పవన్ కళ్యాణ్ సినిమాకు ఇద్దరు డైరెక్టర్లు పనిచేయబోతున్నారు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస సినిమాలు చేస్తున్నాడు. ఎన్నికలు వచ్చేలోపు ఎన్ని వీలైతే అన్ని చేయాలనీ ఫిక్స్ అయ్యాడు. అందుకే వరుస పెట్టి నిర్మాతలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు. అయితే హరీష్ శంకర్ తో చేయాలనుకున్న మూవీ మాత్రం సెట్స్ పైకి వెళ్లకుండా అలాగే ఉండిపోతుంది. దీని తర్వాత ప్రకటించిన సినిమాలు పూర్తి చేసుకోవడం , రిలీజ్ అవ్వడం జరిగింది. కానీ హరీష్ మూవీ మాత్రం అలాగే ఉండిపోయింది.
ఈ క్రమంలో తాజాగా పవన్ కళ్యాణ్ ను హరీష్ శంకర్ కలిసాడు. ప్రస్తుతం పవన్ క్రిష్ డైరెక్షన్లో హరిహర వీరమల్లు మూవీ చేస్తున్నాడు. రామోజీ ఫిలిం సిటీ లో షూటింగ్ జరుపుకుంటుంది. కాగా ఈ చిత్ర సెట్స్ కు హరీష్ వెళ్లి పవన్ కళ్యాణ్ తో ముచ్చటించారు. దీంతో ఫ్యాన్స్ వీరిద్దరూ ఏం మాట్లాడుకున్నారా అని ఆరా తీస్తుండగా.. హరీష్ శంకర్ ఓ ఆసక్తికరమైన విషయం తెలియజేశారు. పవన్ కళ్యాణ్‌తో తాను చేయబోతున్న సినిమాలో మరో దర్శకుడు కూడా వర్క్ చేయబోతున్నారట. ఆయనెవరో కాదు.. సంతోషం , మిస్టర్ పర్‌ఫెక్ట్ వంటి సినిమాకు పని చేసిన దశరథ్ అని తెలిపి షాక్ ఇచ్చాడు. వాస్తవానికి హరీష్ శంకర్ మంచి రైటర్. పవర్‌ఫుల్ డైలాగ్స్ రాస్తారనే పేరుంది. ఆయనకు ఇప్పుడు దశరథ్ కూడా యాడ్ అయ్యారు. హరీష్, మేకర్స్ ఎందుకని ఈ నిర్ణయం తీసుకున్నారో వేచి చూడాల్సిందే.