పుష్ప నుండి మరో రెండు లీక్స్..!

  • Written By: Last Updated:
పుష్ప నుండి మరో రెండు లీక్స్..!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రష్మిక మందన జంటగా నటిస్తున్న సినిమా పుష్ప. ఈ సినిమాకు క్రేజీ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని ప్యాన్ ఇండియా లెవల్ లో తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ సినిమాలో విలన్ గా ఫహాద్ ఫసిల్ నటిస్తున్నట్టు చిత్రయూనిట్ ఇటీవలే ప్రకటించింది. ఇక ఈ సినిమాను మైత్రీమూవీ మేకర్స్ నిర్మిస్తుండగా దేవిశ్రీప్రసాద్ స్వరాలు సమకూరుస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ సినిమాకు ముందు నుండి లీకుల బాధ తప్పడం లేదు. పలు యాక్షన్ సీక్వెన్స్ ల నుండి వీడియోలు భయటకు వచ్చిన సంగతి తెలిసిందే.

అయితే ఇప్పుడు మరో రెండు వీడియోలు లీక్ అయినట్టు సోషల్ మీడియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి. వాటిలో ఒకటి రష్మిక అల్లు అర్జున్ మధ్య సాంగ్ కాగా మరొకటి రష్మిక పై ఆన్ లొకేషన్ వీడియో. లీక్స్ వస్తే ఫ్యాన్స్ కంగారు పడాలి గాని సెలబ్రేట్ చెలుకుంటున్నారు. అయితే ఇంత భారీ బడ్జెట్ సినిమాకు లీక్స్ రాకుండా జాగ్రత్తలు తీసుకోవడం లేదా అనే అనుమానాలు మొదలవుతున్నాయి. ఇక ఇప్పటికైనా మేకర్స్ కొన్ని జాగ్రత్తలు పాటిస్తారో లేదో చూడాలి.

follow us