యూనియన్ బడ్జెట్ 2020 హైలైట్స్

యూనియన్ బడ్జెట్ 2020 హైలైట్స్

ఉద్యోగులకు గుడ్‌న్యూస్ 

ఇన్‌కమ్‌ ట్యాక్స్ స్లాబుల్లో భారీ మార్పులు 
5 లక్షల నుంచి ఏడున్నర లక్షల ఆదాయం ఉంటే 10 శాతం పన్ను
ఇప్పటి వరకు 20 శాతం ఉన్నది ఇకపై 10 శాతానికి తగ్గింపు
రూ. 7.5లక్షల నుంచి రూ.10 లక్షలు ఆదాయం ఉంటే 15 శాతం పన్ను
రూ.10 లక్షల నుంచి రూ.12.5 లక్షల వరకు 20 శాతం పన్ను
రూ. 12.5 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు 25 శాతం పన్ను
రూ.15 లక్షలు, ఆపైన ఆదాయానికి 30 శాతం పన్ను
రూ.15 లక్షల ఆదాయం ఉన్న వారికి పన్ను రేట్లు తగ్గింపు
రూ.10 లక్షల నుంచి రూ.12.5 లక్షల ఆదాయం ఉంటే 10 శాతం పన్ను తగ్గింపు
రూ.7.5 లక్షల నుంచి రూ.10 లక్షల ఆదాయం ఉంటే 15 శాతం పన్ను తగ్గింపు

ప్రత్యక్ష పన్నుల్లో భారీ సంస్కరణలు
 

పన్ను చెల్లింపుదారులు కొత్త స్లాబ్ లేదా పాత స్లాబ్‌ను ఎంచుకునే అవకాశం
కొత్త స్లాబ్‌ల్లో 80(c) రిబేట్లు వర్తించవు

ఎల్‌ఐసీ ప్రైవేటీకరణకు గ్రీన్‌సిగ్నల్ 
 

ఎల్‌ఐసీలో వాటాల విక్రయానికి నిర్ణయం
విక్రయానికి ఐడీబీఐ బ్యాంకు వాటాలు
బ్యాంకుల పర్యవేక్షణకు ప్రత్యేక చర్యలు :
డిపాజిటర్ల ఇన్సూరెన్స్‌ పరిమితి 5 లక్షలకు పెంపు
ప్రభుత్వ రంగ సంస్థల్లో మరిన్ని ఉద్యోగాల పెంపు

5 చారిత్రక ప్రదేశాల అభివృద్ధి
 

5 పురావస్తు మ్యూజియంల ఏర్పాటు
రాంఛీలో ట్రైబల్ మ్యూజియం ఏర్పాటు
సాంస్కృతిక శాఖకు రూ.3150 కోట్లు
లోథల్‌లో మారిటైమ్ మ్యూజియం ఏర్పాటు
పర్యాటక రంగ ప్రచారానికి రూ.2500 కోట్లు
లఢక్ అభివృద్ధికి రూ.5958 కోట్లు
జమ్ము కశ్మీర్‌కూ రూ.30,757 కోట్లు

ఎస్టీలకు రూ.53,700 కోట్లు
ఎస్సీలకు రూ.85 వేల కోట్లు
సీనియర్ సిటిజన్లకు రూ.9500 కోట్లు

బేటీ పడావ్, బేటీ బచావ్ దిగ్విజయం

బాలుర కంటే అధికంగా బాలికల ఎన్‌రోల్‌మెంట్
పోషకాహార పథకాలకు రూ 35,600 కోట్లు
పోషకాహార విధానానికి టాస్క్ ఫోర్స్ ఏర్పాటు
అత్యవసర సేవలకు డిజిటల్ కనెక్టివిటీ
లక్ష గ్రామపంచాయితీలకు ఆప్టికల్ ఫైబర్

దేశవ్యాప్తంగా డేటా సెంటర్ పార్కులు
 

స్టార్టప్‌లకోసం డిజిటల్ ప్లాట్ ఫాం ఏర్పాటు
మిషన్ న్యూ ఎకానమీని ప్రకటించిన కేంద్రం
విద్యుత్ రంగానికి రూ.22,000 కోట్లు
నేషనల్ గ్యాస్ గ్రిడ్ విస్తరణ


అత్యవసర సేవలకు డిజిటల్ కనెక్టివిటీ


రవాణా మౌలిక రంగానికి రూ.1.7 లక్షల కోట్లు
9000 కి.మీ. ఎకనమిక్ కారిడార్
పోర్టులను కలుపుతూ 2వేల కి.మీ. తీరప్రాంత రోడ్ల అభివృద్ధి
త్వరలో చెన్నై – బెంగళూరు ఎక్స్ ప్రెస్ వే
2023నాటికి ఢిల్లీ – ముంబై ఎక్స్ ప్రెస్ వే
ముంబై – అహ్మదాబాద్ మధ్య హైస్పీడ్ ట్రైన్
9000 కి.మీ. ఎకనమిక్ కారిడార్


ఎగుమతి రుణాల పంపిణీకి నిర్విక్ పథకం

ఇండస్ట్రీ, కామర్స్‌కు రూ.27,300 కోట్లు
మౌలిక రంగంలో నైపుణ్యాభివృద్ధిపై దృష్టి
ప్రతి జిల్లానూ ఎగుమతి కేంద్రంగా అభివృద్ధి చేయడమే లక్ష్యం
ఇన్‌ఫ్రా రంగానికి వచ్చే ఐదేళ్లకూ వంద లక్షల కోట్లు
వస్తువుల ఉత్పత్తికి ప్రత్యేక ప్రోత్సాహకాలు 

ఈ ప్రోత్సాహకాలకు త్వరలో విధివిధానాలు
స్కిల్ డెవలప్ మెంట్ కు రూ.3,000 కోట్లు
నేషనల్ టెక్ టెక్స్ టైల్ మిషన్ ప్రతిపాదన
ఎగుమతి కంపెనీలకు కొత్త ఇన్సూరెన్స్ పథకం
ప్రతి జిల్లా ఆసుపత్రిలో మెడికల్ కాలేజ్
మరిన్ని జాబ్ ఓరియెంటెడ్ కోర్సులు
డిగ్రీ లెవల్లో ఆన్ లైన్ ప్రోగ్రామ్స్ కు ప్రతిపాదన
నేషనల్ పోలీస్ యూనివర్సిటీ, నేషనల్ ఫోరెన్సిక్ యూనివర్సిటీల ఏర్పాటు
విద్యారంగానికి రూ.99,300 కోట్లు
2025 నాటికి క్షయ వ్యాధి నిర్మూలనే ధ్యేయం
 

నీటి సంరక్షణ పథకాలకు ప్రోత్సాహకాలు
 

ప్రధాని జన్ ఆరోగ్య యోజనకు 69వేల కోట్లు
పీపీపీ పద్ధతిలో మరిన్ని ఆసుపత్రులు
ఆయుష్మాన్ భారత్ స్కీమ్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం
వ్యవసాయ రంగానికి భారీ కేటాయింపులు
కిసాన్ క్రెడిట్ స్కీమ్‌కోసం 15 లక్షల కోట్లు
మార్కెటింగ్ విధానం సరళతరం 
వ్యవసాయాభివృద్ధికి 16 సూత్రాల ప్రత్యేక కార్యక్రమం 
 

మత్స్యకార రంగానికి కేంద్రం ప్రాధాన్యత
 

2022-23 నాటికి 200 లక్షల టన్నులు మత్స్య ఉత్పత్తి 
మత్స్య రంగంలో గ్రామీణ యువతకు ప్రోత్సాహకాలు 
వ్యవసాయ రంగానికి భారీ కేటాయింపులు
కిసాన్ క్రెడిట్ స్కీమ్‌కోసం 15 లక్షల కోట్లు
వ్యవసాయం, నీటిపారుదల, గ్రామీణాభివృద్ధికి 2.83 లక్షల కోట్లు

Tags

follow us

Web Stories