గుర్తుకురాని హీరోయిన్స్..

గుర్తుకురాని హీరోయిన్స్..

ఒకప్పుడు హీరోతో సమానంగా హీరోయిన్లు గుర్తుకొచ్చేవారు..కానీ ప్రస్తుతం టక్కుమని ఇద్దరి హీరోయిన్లు పేర్లు , వారు నటిస్తున్న సినిమాలు , హిట్స్ కొట్టిన మూవీస్ పేర్లు చెప్పమంటే ఎవ్వరు చెప్పలేకపోతున్నారు. హిట్ పడితే మరో ఛాన్స్..లేదంటే అంతే సంగతి. ఒకప్పుడు వరుస హిట్లు అందుకున్న భామలు ఇప్పుడు ఛాన్సులు లేక ఖాళీగా ఉన్నారు. సమంత , కాజల్ , రకుల్ , రష్మిక ల పలువురు ఉన్నారు.

కెరియర్ మొదట్లో సమంత తన దూకుడు ను కనపరిచింది. వరుస అగ్ర హీరోల సరసన నటిస్తూ అభిమానులను అలరిస్తూ వచ్చింది. కానీ హెల్త్ ప్రాబ్లెమ్ వల్ల ప్రస్తుతం కొత్త సినిమాలకు ఒప్పుకోవడం లేదు. అలాగే సెట్స్ ఉన్న సినిమాలు కూడా ఆగిపోయాయి.

ఇక కాజల్ సంగతి తెలిసిందే. కెరియర్ జెట్ స్పీడ్ లో ఉండగానే పెళ్లి చేసుకోవడం , తల్లి కావడం చకచకా జరిగిపోయాయి. ప్రస్తుతం ఫ్యామిలీ తో గడుపుతుంది. ఒకవేళ మళ్లీ సినిమాల్లోకి వచ్చిన హీరోయిన్ ఛాన్సులు వస్తాయా అనేది అనుమానమే.

రష్మిక విషయానికి వస్తే ..కెరియర్ లో బ్లాక్ బస్టర్ హిట్స్ తక్కువే. పుష్ప మూవీ తో పాన్ రేంజ్ లో గుర్తింపు సాధించింది తప్పితే..పెద్దగా పొడిసింది ఏమిలేదు. బాలీవుడ్ లో ఈమె నటించిన రెండు ప్లాపులుగానే మిగిలాయి. వచ్చే ఏడాది పుష్ప 2 తో రాబోతుంది.

ఇక రకుల్ ప్రీతిసింగ్ ను జనాలు ఎప్పుడో మరచిపోయారు. సినిమా ఛాన్సులు లేక చిన్న చిన్న బిజినెస్ లు చేసుకుంటూ వెళ్తుంది.

మిల్కీ బ్యూటీ తమన్నా సైతం అంతే వెండితెర ఛాన్సులు రాకపోవడం తో ఓటిటి , వెబ్ సిరీస్ లతో కాలం గడిపేస్తుంది. పూజా హగ్దే విషయానికి వస్తే గత ఏడాది హిట్స్ అందుకున్న ఈ బ్యూటీ..ఈ ఏడాది వరుస ప్లాప్స్ అందుకొని ఐరెన్ లెగ్ ముద్ర వేసుకుంది. ప్రస్తుతం ఈమెకు ఛాన్సులు ఇచ్చేందుకు నిర్మాతలు ఆలోచిస్తున్నారు.

కృతి శెట్టి విషయానికి వస్తే..మూడు హిట్స్ , మూడు ప్లాప్ లతో ఈ భామ ఉంది. పెద్ద హీరోలు ఈమె వైపు చూడడం లేదు. ఎవరైనా చూస్తే..అది హిట్ అయితే భామ బిజీ అవ్వడం తప్ప మరోటి లేదు. ఇక చిన్న చిన్న హీరోయిన్లు వస్తున్నారు..వెళ్తున్నారు తప్ప ఎవ్వరు కూడా గుర్తు పెట్టుకొనే స్థాయి లో లేరు. మొత్తంగా చూస్తే ఇండస్ట్రీ లో హీరోయిన్లు ఉన్నారంటే ఉన్నారు తప్ప గుర్తుపెట్టుకొని రేంజ్ లో మాత్రం ఎవ్వరు లేరు.

follow us