ఆహా లో స్ట్రీమింగ్ అవుతున్న ప్రభాస్ అన్ స్టాపబుల్ ఎపిసోడ్ 1

ఆహా లో స్ట్రీమింగ్ అవుతున్న ప్రభాస్ అన్ స్టాపబుల్ ఎపిసోడ్ 1

ఓ రోజు ముందే స్ట్రీమింగ్ అవుతుంది ప్రభాస్ అన్ స్టాపబుల్ ఎపిసోడ్ 1. నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ టాక్ షో అదిరిపోయే రేటింగ్స్ తో దూసుకపోతున్న సంగతి తెలిసిందే. తన కెరీర్ లో ఫస్ట్ టైం హోస్ట్ గా చేస్తున్న బాలయ్య తనదైన శైలిలో దుమ్మురేపుతున్నారు. ప్రముఖ సంస్థ ఆహా ఓటీటీ వేదికగా ప్రసారం అవుతున్న ఈ షో..ప్రస్తుతం రెండో సీజన్ జరుపుకుంటుంది.

ఇప్పటికే ఈ సీజన్ లో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరై సందడి చేసారు. తాజాగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో పాటు హీరో గోపీచంద్ హాజరయ్యారు. రెండు ఎపిసోడ్ లుగా ఇది స్ట్రీమింగ్ కాబోతుంది. మొదటి ఎపిసోడ్ డిసెంబర్ 30 న , రెండో ఎపిసోడ్ జనవరి 06 న స్ట్రీమింగ్ కాబోతున్నట్లు ఆహా ప్రకటించింది. కానీ మొదటి ఎపిసోడ్ ఓ రోజు ముందే స్ట్రీమింగ్ అవుతుంది. ఈరోజు రాత్రి 9 కే స్ట్రీమింగ్ మొదలైంది. దీంతో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.

follow us