సరికొత్త రికార్డు సృష్టించిన బాలయ్య షో

సరికొత్త రికార్డు సృష్టించిన బాలయ్య షో

నందమూరి బాలకృష్ణ గతంలో ఎన్నడూ లేని విధంగా స్పీడ్ పెంచాడు. మొన్నటి వరకు కేవలం సినిమాలతోనే బిజీ గా కనిపించేవారు. కానీ ఇప్పుడు ఓటిటి షోస్ తో పాటు కమర్షియల్ యాడ్స్ లలో కూడా నటిస్తూ ప్రేక్షకులను , అభిమానులను అలరిస్తున్నాడు. ఆహా లో Unstoppable with NBK సక్సెస్ కావడం తో ..Unstoppable with NBK 2 స్టార్ట్ చేసారు. మొదటి సీజన్ కు రెట్టింపు వ్యూస్ తో సీజన్ 2 సక్సెస్ అవుతూ వస్తుంది. తాజాగా ఈ సీజన్ సరికొత్త రికార్డు సృష్టించింది.

తాజాగా విడుదలైన 5వ ఎపిసోడ్ లో టాప్ టాలీవుడ్ లెజెండ్స్ కనిపించారు. నిర్మాతలు అల్లు అరవింద్ తో పాటు సురేష్ బాబు, సీనియర్ దర్శకులు కోదండరామిరెడ్డి, కె.రాఘవేంద్రరావు హాజరయ్యారు. వీరంతా కలిసి 90 ఏళ్ల తెలుగు సినిమా చరిత్రలో వచ్చిన కొన్ని సినిమాల గురించి చర్చించారు. అల్లు అరవింద్, సురేష్ బాబు ముందు షోలోకి రాగా ఆ తరువాత కె.రాఘవేంద్రరావు ఎంట్రీ ఇచ్చారు. జీవితమంతా 40 ఏళ్ల నుంచి వీరి ఇద్దరి మద్యే సాండ్ విచ్ అయ్యాను. మళ్లీ ఇక్కడ కూడా అంతేనా అని రాఘవేంద్రరావు సరదాగా జోక్ చేశారు. అంతే కాదు రాఘవేంద్రరావు కు సంబదించిన పలు రహస్యాలు కూడా అరవింద్ రివీల్ చేయడం..పలు ఆసక్తికర విషయాలు రాఘవేంద్రరావు తెలుపడం వంటివి హైలైట్ గా నిలిచాయి. ఇలా సరదాగా సాగిన ఈ ఎపిసోడ్ సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ ఎపిసోడ్ ను రెండు రోజుల్లో 30 మిలియన్స్ మినిట్స్ పాటు వీక్షకులు చూశారాని ఆహా వెల్లడించింది.

follow us