అత్తమ్మను మిస్ అవుతున్నాను అంటూ ఉపాసన ఎమోషనల్ పోస్ట్

అత్తమ్మను మిస్ అవుతున్నాను అంటూ ఉపాసన ఎమోషనల్ పోస్ట్

మెగా కోడలు ఉపాసన..అత్తమ్మను మిస్ అవుతున్నాను అంటూ ఎమోషల్ పోస్ట్ పెట్టింది. తాజాగా చరణ్ – ఉపాసన లు తల్లిదండ్రులు కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని స్వయంగా చిరంజీవి సోషల్ మీడియా వేదికగా తెలిపి మెగా అభిమానుల్లో ఆనందం నింపారు. కాగా తల్లి అయిన ఉపాసన మొదటిసారి సోషల్ మీడియా వేదికగా స్పందించారు.

‘నా జీవితంలో ముఖ్యమైన మహిళల ఆశీర్వాదంతో మాతృత్వంలో అడుగుపెట్టాను. అయితే అత్తమ్మను చాలా మిస్ అవుతున్నాను’ అని కామెంట్ చేశారు. ఈ కామెంట్ తో పాటు అమ్మ, బామ్మతో పాటు తన కుటుంబంలోని మహిళలతో దిగిన ఫోటోలు షేర్ చేశారు. ఆ ఫొటోల్లో ఉపాసన అత్తగారైన సురేఖ మిస్ అయ్యారు. అందుకే ఉపాసన… అత్తమ్మను మిస్ అవుతున్నానంటూ ప్రత్యేకంగా కామెంట్ తో గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం ఉపాసన తన తల్లి ఇంట్లో ఉంది.

follow us