కొత్త సినిమాలకు గండికొడుతున్న ఉప్పెన.!

uppena-is-srtong-in-second-week
uppena-is-srtong-in-second-week

ఇటీవల కాలంలో ఎన్నో అంచనాల మధ్య విడుదలై కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న చిత్రం ఉప్పెన. ఈ సినిమాలోని పాటలు..సినిమా క్లైమాక్స్ పై వచ్చిన వార్తలతో ఫస్ట్ డే రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ వచ్చాయి. నిజానికి ఓ చిన్న సినిమాకు ఈ రేంజ్ లో కలెక్షన్స్ రావడం గొప్పవిషయం. ఇక ఈ సినిమా వారాలు వారాలు నడుస్తుందని ఎటువంటి అంచనాలు లేవు. ఈ వారం మూడు సినిమాలు కపటదారి, నాంది, విశాల్ చక్ర రిలీజ్ కావడంతో ఉప్పెనకు బ్రేక్ పడుతుందని అనుకున్నారు. కానీ కొత్త సినిమాలకు షాక్ ఇస్తూ ఉప్పెన దూసుకువెళుతోంది. రిలీజ్ అయిన మూడు సినిమాలకు థియేటర్లలో పెద్ద సందడి కనిపించడం లేదు.

ప్రేక్షకులు ఉప్పెన తరవాత సెకండ్ అప్షన్ గా నాంది సినిమాను ఎంచుకోగా..కాపఠధారి ఊసే కనిపించడం లేదు. ఇక చక్ర కూడా అంతంత మాత్రం గానే ఉంది. కానీ ఉప్పెనకు శనివారం, ఆదివారాలు కూడా మేజర్ సినిమాల్లో హౌస్ ఫుల్ అయ్యాయి. మ్యాట్నీ, ఫస్ట్ షోకు ప్యాక్డ్ హౌసెస్ నడుస్తోంది. కానీ ఈవారం విడుదలైన సినిమాలకు అలాంటి పరిస్థితి లేదు. ఇక ఉప్పెన సినిమాకు ప్రీ రిలీజ్ బిజినెస్ 20.5 కోటయ్యింది. అంతే కాకుండా మూడు రోజుల్లోనే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించింది. ఇక తొమ్మిది రోజులు పూర్తయ్యేసరికి మొత్తం 41.10 కోట్ల షేర్ ను రాబట్టి సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది.