రివ్యూ : “వి” – ఓ భార్య కోరిక..

నాని విల్లన్ గా నటించిన వి సినిమా అమెజాన్ లో ఈ రోజు విడుదల చేసారు..
ఈ సినిమా ను థియేటర్ లో విడుదల చేదాం అనుకున్న కరోనా వైరస్ లాక్ డౌన్ కారణం గా దిల్ రాజు ఈ సినిమాను అమెజాన్ కు అమ్మేసారు.. అమెజాన్ లో ప్రీమియర్రిలీజ్ ఒక్క రోజు ముందే సినిమాను ప్రేక్షకులకు అందుబాటు లో ఉంచారు..
నాని నిర్మాత నిర్ణయాన్ని వెతిరేకించనా దిల్ రాజు ఆయనతో వాదన కు దిగి మరి ఈ సినిమాను అమెజాన్ కు అమ్మేసారని వార్తలు వచ్చాయి.. మరో సారి దిల్ రాజు తన నిర్ణయంతో మంచి నిర్మాత అని నిరూపించుకున్నారు..
ఒక సాదా సీదా కధ ను ఒక హీరో ను విల్లన్ చేస్తే చేసేస్తారు అనుకున్నాడో ఏమో దర్శకుడికే తెలియాలి.. నాని హీరో కాబట్టి విల్లన్ పాత్ర లో కనిపించడానికి కుతుహులం చూపించిన.. దర్శకుడికి సినిమాలో వినూత్నత లేక పోతే ఆదరణ దొరకడం కష్టం అన్న విషయం అర్ధం అయ్యి ఉండక పోవచ్చు దిల్ రాజు తో కొన్ని కోట్లు పెట్టించి సినిమా తీసాడు..
కథ : ఒక ఆర్మీ ఆఫీసర్ తన భార్య మరణానికి రివెంజ్ తీర్చుకోవడం..ఆమె ఆఖరి కోరిక తీర్చడం.. అంత కన్నా సినిమాలో చెప్పడానికి ఏమి లేదు..
విశ్లేషణ : సుధీర్ బాబు ఒక స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్ పాత్ర లో ప్రేక్షకులను అలరించారు.. ఆయన ఈ సినిమా కోసం పడ్డ శ్రమలో స్క్రీన్ మీద కనిపిస్తుంది.. నాని నటన లోని ఎక్స్పీరియన్స్ కూడా అర్ధం అవ్వుతుంది.. దిల్ రాజు ఒక నిర్మాత గా సినిమాకు ఎక్కడ తక్కువ చేయలేదు.. కానీ అసలు ఒక సాదా సీదా కథ ను తీసుకొని సినిమా తియ్యాలి అని అనిపించినా దర్శకుడుని మెచ్చుకోవచ్చు..
హీరోయిన్ నివేద థామస్ అలానే అదితి రావు హైదరి.. సినిమా లో హీరోయిన్ ఉండాలి కాబట్టి ఉన్నారు అని అనిపించక మానదు..
సినిమా లో అంత ప్రేమ కనిపించదు అలానే విల్లన్ కానీ హీరో చేసే మర్డర్స్ లో క్రూరత్వము కనిపించదు.. ఈ సినిమా చుసీనా ఎవరికైనా ఒక మాములు సినిమా మీద నాని చాలా ఆశలు పెట్టుకున్నాడు అని అర్ధం అవ్వుతుంది.
చివరిగా : డిజిటల్ రిలీజ్ కు పర్ఫెక్ట్ సినిమా..