వ‌కీల్ సాబ్ నుండి కంటిపాప సాంగ్ రిలీజ్‌.!

  • Written By: Last Updated:
వ‌కీల్ సాబ్ నుండి కంటిపాప సాంగ్ రిలీజ్‌.!

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ బాలీవుడ్ లో సూప‌ర్ హిట్ గా నిలిచిన పింక్ సినిమా రీమేక్ వ‌కీల్ సాబ్ లో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాను బోనీక‌పూర్ దిల్ రాజు, శిరీష్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని మ‌హిళ‌లు ఎదుర్కొంటున్న లైంగిక వేధింపులు..వారి హ‌క్కుల కోసం పోరాటం నేప‌థ్యంలో తెర‌కెక్కిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి వేణు శ్రీరామ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. సినిమాలో ప‌వ‌న్ క‌ల్యాణ్ కు జంటగా‌ శృతిహాస‌న్ నటిస్తోంది. ఇక ఈ చిత్రానికి త‌మ‌న్ స్వ‌రాలు స‌మ‌కూరుస్తున్నారు. ఇప్ప‌టికే సినిమా నుండి మ‌గువా మ‌గువా..సాంగ్ విడుద‌ల కాగా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది.

ఇక ఇటీవ‌ల సినిమా నుండి స‌త్య‌మేవ‌జ‌య‌తే అనే మ‌రోపాట‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. ఆ పాటకు ఎక్కువ వ్యూవ్స్ వచ్చాయి. ఇక తాజాగా సినిమా నుండి మ‌రో సాంగ్ ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. కంటి పాప అంటూ సాగే ఈ లిరిక‌ల్ సాంగ్ శ్రోత‌ల‌ను ఆక‌ట్టుకుంది. ఇక ఈ లిరిక‌ల్ సాంగ్ లో ప‌వ‌న్ శృతిహాస‌న్ కు సంభందించిన కొన్ని స‌న్నివేశాల‌ను కూడా జోడించారు. ఈ పాట‌ను అర్మాన్ మాలిక్ పాడ‌గా..రామ‌జోగ‌య్య శాస్త్రి లిరిక్స్ అందించారు. ఇక ఎన్నో అంచ‌నాల మ‌ధ్య వ‌కీల్ సాబ్ ఎప్రిల్ 9 న విడుద‌ల కాబోతుంది.

follow us