వకీల్ సాబ్ రివ్యూ…పవర్ ప్యాక్డ్ మూవీ..!

దాదాపు మూడేళ్ల తరవాత పవన్ రీఎంట్రీ ఇచ్చిన సినిమా వకీల్ సాబ్. ఓ మై ఫ్రెండ్, ఏంసీఏ సినిమాల దర్శకుడు వేణు శ్రీరామ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. పింక్ సినిమాకు రీమేక్ గా వకీల్ సాబ్ ను తెరకెక్కించారు. తెలుగు రీమేక్ లో పవన్ ఇమేజ్ కు తగినట్టుగా పలు మార్పులు చేశామని వేణు శ్రీరామ్ ఇదివరకే తెలిపారు. సినిమానుండి విడుదలైన పాటలు, టీజర్ , ట్రైలర్ ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. దాంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. మరో వైపు పవన్ రీఎంట్రీ కావడంతో సినిమా పై భారీ అంచనాలు నెల కొన్నాయి. మరి ఆ అంచనాలను వకీల్ సాబ్ రీచ్ అయ్యిందా లేదా అన్నది ఇప్పుడు చూద్దాం.
కథ కథనం
సమాజం కోసం ఏదైనా చేయాలనే తపనతో సత్యదేవ్ పవన్ కల్యాణ్ లాయర్ వృత్తిని ఎంచుకుంటారు. ఆ తరవాత శృతి హాసన్ నె పెళ్లి చేసుకున్న సత్యదేవ్ కొన్ని కారణాల వల్ల లాయర్ వృత్తికి గుడ్ బై చెబుతారు. ఈ క్రమంలో హైదరాబాద్ లోని ఓ ఏరియాకు వచ్చి నివాసం ఉంటాడు. అదే ఏరియాలో ఉండే నివేధిత, అంజలి, అనన్యలు స్థానిక ఎంపీ కొడుకు తో ఓ గొడవ జరుగుంతుంది. ఈ గొడవలో నివేధిత ఎంపీ కొడుకును కొట్టిందని జైలుకు పంపిస్తారు. అంతే కాకుండా అక్రమకేసులు బనాయించి నివేధితను బయటకు రానివ్వకుండా చేయాలని ఎంపీ ప్లాన్ వేస్తారు. ఈ కేసు పవన్ దృష్టికి రాగా కొన్ని సలహాలు ఇచ్చి నివేధిత కు హెల్ప్ చేస్తాడు. సత్యదేవ్ నివేధితకు సహాయం చేస్తున్న విషయం ఎంపీకి తెలియడంతో సీరియస్ గా తీసుకున్న ఎంపీ సత్యదేవ్ ను కొట్టడానికి గుడాలను పంపిస్తాడు. అనంతరం ఈ కేసును సవాలుగా తీసుకుని సత్యదేవ్ తానే టేకప్ చేస్తాడు. అంతే కాకుండా కోర్టులో నంద ప్రకాశ్ రాజ్ కు పోటీగా వాదనలు వినిపిస్తాడు. ఇక సత్యదేవ్ ఈ కేసు నుండి నివేధితను కాపాడగలిగాడా..?అసలు లాయర్ వృత్తిని ఎందుకు వదులుకోవాలని అనుకున్నాడు..? అసలు నివేధితకు ఎంపీ కొడుకు మధ్య ఎందుకు గొడవ జరిగింది అనేది సినిమాలో చూడాల్సిందే.
విశ్లేషణ
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ లేటుగా వచ్చినా లేటెస్టుగా వచ్చారు. ఈ సినిమాతో పవన్ తనలోని కొత్త కోణాన్ని పరిచయం చేశారు. మూడేళ్ల తరవాత పవన్ కల్యాణ్ వకీల్ సాబ్ సినిమాతో మాస్ క్లాస్ కలిసిన విందు బోజనాన్ని పెట్టాడు. సినిమాలో పవన్ లుక్స్ సైతం వింటేజ్ ఫీల్ ను కలిగిస్తాయి. సినిమాలో మాస్ ఆడియన్స్ విజిల్స్ కొట్టే యాక్షన్ సీన్స్ తో పాటు..కంటతడి పెట్టించే ఎమోషనల్ సన్నివేశాలు కూడా ఉన్నాయి. సినిమాలో ఫస్ట్ హాఫ్ లో కొన్ని సీన్లలో అతిగా చూపించారేమో అన్న ఫీలింగ్ వస్తుంది. అయితే సెకండాఫ్ తరవాత మాత్రం ఫస్ట్ హాఫ్ అసలు గుర్తకురాదు. అంతే కాకుండా థియెటర్ నుండి బయటకు వచ్చే సమయంలో కూడా ఆడియన్స్ కు సెకండ్ హాఫ్ సీన్లు మైండ్ లో రన్ అవుతూనే ఉంటాయి. ఇంటర్ వెల్ మరియు క్లైమాక్స్ సన్నివేశాలు సినిమాకు ప్రాణం పోశాయి. మొత్తానికి పవన్ ఫ్యాన్స్ కు మాత్రమే కాకుండా ఈ సినిమా ప్రతి ప్రక్షకుడిని ఎంతగానో ఆకట్టుకుంటుంది. సినిమాను ఫ్యామిలీతో కలిసి తప్పకుండా చూడొచ్చు.
నటీనటుల పర్ఫామెన్స్
ఈ సినిమాలో పవన్ డిఫరెంట్ లుక్ లో కనిపించి ఫ్యాన్స్ ను సర్పైజ్ చేశారు. పీక్స్ లెవల్ లో పవన్ తన పర్ఫామెన్స్ ను కనబరిచారు. సినిమాలో ఎమోషనల్ సీన్లలోనే కాకుండా మధ్యలో సెట్లైర్లు వేయడం..కోర్టు సన్నివేశాలు.. కాలేజీ సన్నివేశాలల్లో పవన్ అద్భుతంగా నటించారు. ఇక సినిమాకు నివేదిత ఎమోషనల్ సీన్స్ ప్రాణం పోశాయి. అంజలి కోర్టు సీన్లో అదరగొడుతుంది కానీ ఆ తరవాత ఆమెకు పెద్దగా స్కోప్ ఉండదు. ఇక అనన్య తన పాత్రమేర నటించిన ఆమెను హైలెట్ చేసే సీన్స్ లేకపోవడంతో టాలెంట్ ను నిరూపించకునే అవకాశం దక్కలేదు. ఇక ప్రకాశ్ రాజ్ యాజ్ ఇట్ ఈస్ గా తన నటనతో ఆకట్టుకున్నాడు.
టెక్నికల్ టీం
పి ఎస్ వినోద్ కుమార్ విజువల్స్ అదిరిపోయాయి. ముఖ్యంగా మూడు పాత్రలో పవన్ ను డిఫరెంట్ లుక్ లో చక్కగా చూపించాడు. పవన్ పూడి ఎటింగ్ బాగుంది. దిల్ రాజు..బోణీ కపూర్ నిర్మాణ విలువలు బాగున్నాయి. అభిమాన పవన్ కల్యాణ్ సినిమాకు సంగీతాన్ని ఇవ్వాలన్న తమన్ కల ఈ సినిమాతో నెరవేరింది. అంతేకాకుండా వచ్చిన అవకాశాన్ని తమన్ సద్వినియోగం చేసుకున్నాడు. ఈ సినిమాలోపాటలు సూపర్ హిట్ గా నిలిచిన సంగతి సినిమా విడుదలకు ముందే తెలిసిన విషయం. అయితే బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ను తమన్ అంతకంటే బాగా ఇచ్చారు. ముఖ్యంగా కోర్టు సీన్లలో తమన్ మ్యూజిక్ సూపర్ అనే చెప్పాలి.