కృష్ణ జిల్లా గన్నవరం నియోజకవర్గ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు అలాగే , తెలుగుదేశం పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేసినట్లు లేఖ లో పేర్కొన్నారు, అలాగే లేఖలో అనేక అంశాలు ప్రస్తావించారు. చంద్రబాబు నాయుడు గారి నేత్త్రుతం లో పని చేయడానికి అవకాశం ఇచ్చినదుకు ఆయనకి ధన్యవాదాలు తెలిపారు.
రాజీనామా చేయడానికి గల కారణాలు వల్లభనేని వంశీ వివరించారు , నా అనుచరులు, మద్దతుదారులపై కొందరు స్థానిక వైస్సార్సీపీ నాయకులు ఇబ్బందికి గురిచేస్తున్నారు అందుకై తాను పార్టీకి , సభ్యత్వానికి రాజీనామా చేశాను అని పేర్కొన్నారు .
అయితే వల్లభనేని రాజీనామా చేయడానికి వైస్సార్సీపీ దాడులు అని పేర్కొనడం గమనార్హం. రాజకీయ వత్తిడులు తట్టుకోలేక రాజీనామా చేయడం అనేది కార్యకర్తల్లో పిరికితనం నింపడమే !. రాజీనామాకి ముందు కొడాలి నాని , పేర్ని నానిలను వెంటపెట్టుకొని స్వయంగా జగన్‌ను కలిసొచ్చారు వంశీ. ఏ రాజకీయ ఉదేశం లేకపోతే రాజీనామాకు ముందు వైస్ జగన్ ని కలుస్తారు . చెక్‌మేట్ గేమ్ ఆడుతున్నారని అనుకునేవాళ్లూ లేకపోలేదు.