వాల్తేర్ వీరయ్య కథ ఇదేనా..?

వాల్తేర్ వీరయ్య కథ ఇదేనా..?

మెగాస్టార్ చిరంజీవి – బాబీ కలయిక రాబోతున్న వాల్తేర్ వీరయ్య ..జనవరి 13 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు అధికారిక ప్రకటన చేసారు మైత్రి మూవీ మేకర్స్. గాడ్ ఫాదర్ తో హిట్ అందుకున్న చిరంజీవి..వాల్తేర్ వీరయ్య గా అసలైన యాక్షన్ ఎంటర్టైనర్ తో రాబోతున్నాడు. ఇప్పటికే బాస్ సాంగ్ సరికొత్త ట్రెండ్ సెట్ చేయడమే కాదు అంచనాలు తారాస్థాయికి తీసుకెళ్లింది.

ఈ క్రమంలో ఈ సినిమా కథ ఇదే అంటూ ఓ స్టోరీ వైరల్ గా చక్కర్లు కొడుతుంది. ఈ చిత్రం లో చిరంజీవి – రవితేజ సవతి అన్నదమ్ములుగా నటిస్తున్నారు..రవితేజ ఒక పవర్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తుంటే,మెగాస్టార్ చిరంజీవి దండాలు, సెటిల్మెంట్స్ చేసే ఒక మాస్ జాలరి పాత్రలో నటించాడు..అయితే ప్రథమార్థం మొత్తం చిరంజీవి – రవితేజ మధ్య గొడవలే ఉంటాయట..ఇంటర్వెల్ సన్నివేశం లో ఒకరి పై ఒకరు తలపడుతారు కూడా..అయితే ఈ సినిమా లో చిరంజీవి ని రవితేజ ఒక సన్నివేశం అరెస్ట్ చేసి జైలుకి తరలిస్తాడట. మరి నిజంగా ఈ కథ సినెమాలోనిదేనా..లేక సోషల్ మీడియా రాయుళ్ల కథనా అనేది సినిమా చూస్తే కానీ తెలియదు.

follow us

Related News