వాల్తేర్ వీరయ్య టైటిల్ సాంగ్ వచ్చేస్తుంది.

వాల్తేర్ వీరయ్య నుండి టైటిల్ సాంగ్ వచ్చేస్తుంది. మెగాస్టార్ చిరంజీవి – బాబీ కలయికలో రాబోతున్న వాల్తేర్ వీరయ్య ..జనవరి 13 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో తెరకెక్కిన ఈ మూవీ లో శృతి హాసన్ హీరోయిన్ గా నటించగా , దేవి శ్రీ మ్యూజిక్ అందించారు. గాడ్ ఫాదర్ తో హిట్ అందుకున్న చిరంజీవి..వాల్తేర్ వీరయ్య గా అసలైన యాక్షన్ ఎంటర్టైనర్ తో రాబోతున్నాడు. ఇప్పటికే బాస్ సాంగ్, శ్రీదేవి సాంగ్ సరికొత్త ట్రెండ్ సెట్ చేయడమే కాదు అంచనాలు తారాస్థాయికి తీసుకెళ్లాయి.
ఇక ఇప్పుడు సినిమాలోని టైటిల్ సాంగ్‌ను డిసెంబర్ 26వ తేదీన రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు . రాక్ స్టార్ దేవీ శ్రీప్రసాద్ రూపొందించిన రాకింగ్ ట్రాక్‌ను ప్రేక్షకులకు అందించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు. ఈ పాటకు సంబంధించిన పోస్టర్‌ను రిలీజ్ చేశారు. పోర్టబుల్ గ్యాస్ బర్నర్‌ను చేతిలో పట్టుకొని కళ్లకు గాగుల్స్ పెట్టుకొని స్టైలిష్‌గా గ్యాంగ్ లీడర్ లుక్‌ను మరిపించే విధంగా చిరంజీవి కనిపిస్తున్నాడు.