తమిళ స్టార్ ను లైన్ లో పెట్టిన వంశీపైడిపల్లి..టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ తో.?

టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు దిల్ రాజు భారీ సినిమాలను నిర్మించేందుకు సిద్దమౌతున్నారు. నిర్మాతగా దిల్ రాజు ఎన్నో సినిమాలు నిర్మించినప్పటికీ ఆయన ఎక్కువ బడ్జెట్ పెట్టడంలో ఆసక్తి చూపరని ఇండస్ట్రీ లో టాక్. అయితే దిల్ రాజు ఇప్పుడు భారీ బడ్జెట్ సినిమాలనే సెట్ చెస్తున్నారు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా దిల్ రాజు నిర్మించిన వకీల్ సాబ్ సినిమా ఇటీవలే విడదలై మంచి విజయం సాధించింది. కరోనా కారణంగా ఎక్కువ రోజులు ఆడకపోయినా ఈ సినిమాకు మంచి కలెక్షన్ లు వచ్చాయని దిల్ రాజు వెల్లడించారు. ఇదిలా ఉండగా ఇప్పటికే దిల్ రాజు రామ్ చరణ్ హీరోగా తమిళ దర్శకుడు శంకర్ తో ఓ భారీ చిత్రాన్ని ప్లాన్ చేసారు.
దీనిపై ఆఫీషియల్ ప్రకటన కూడా విడుదల చేసారు. ఇదిలా ఉండగానే దిల్ రాజు మరో సినిమాను లైన్ లో పెట్టినట్టు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. దిల్ రాజు తమిళ స్టార్ హీరో తలపతి విజయ్ తో ఓ సినిమా చేయబోతున్నారట. ఈ చిత్రానికి టాలీవుడ్ దర్శకుడు వంశీపైడిపల్లి దర్శకత్వం వహించబోతున్నారట. అంతే కాకుండా ఈ సినిమాపై త్వరలోనే అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా రాబోతున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమాను తెలుగు తమిళ బాషల్లో ఒకే సారి చిత్రించబోతున్నట్టు తెలుస్తుంది.