వారసుడు మూవీని సీరియల్స్ తో పోల్చడం ఫై వంశీ పైడిపల్లి ఫైర్

  • Written By: Last Updated:
వారసుడు మూవీని సీరియల్స్ తో పోల్చడం ఫై వంశీ పైడిపల్లి ఫైర్

 

ఎప్పటిలాగానే టాలీవుడ్ సంక్రాంతి బరిలో అగ్ర హీరోల చిత్రాలు పోటీపడ్డాయి. ఇద్దరు తెలుగు అగ్ర హీరోలతో..తమిళ స్టార్ హీరోస్ పోటీపడ్డారు.కానీ తెలుగు హీరోలే ఫై చేయి సాధించారు. బాబీ – మెగాస్టార్ చిరంజీవి కలయికలో తెరకెక్కిన వాల్తేర్ వీరయ్య , క్రాక్ ఫేమ్ గోపీచంద్ మలినేని – నందమూరి బాలకృష్ణ కలయికలో తెరకెక్కిన వీర సింహ రెడ్డి చిత్రాలు సంక్రాంతి బరిలో భారీ అంచనాల నడుమ విడుదలై బ్లాక్ బస్టర్ విజయాలు సాధించడమే కాదు బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తున్నాయి. అలాగే తమిళ స్టార్ హీరో విజయ్ – తెలుగు డైరెక్టర్ వంశీ పైడిపల్లి కలయికలో వారసుడు మూవీ , అజిత్ హీరోగా తెరకెక్కిన తెగింపు మూవీస్ సైతం సంక్రాంతి కానుకగా వచ్చాయి కానీ ప్రేక్షకులను అలరించడంలో విఫలమయ్యాయి.

ముఖ్యంగా వారసుడు విషయంలో నెటిజన్లు ఓ రేంజ్ లో సెటైర్లు వేస్తున్నారు. సినిమా సీరియల్ మాదిరి ఉందని , సినిమా అంత కూడా సాగతీస్తూ సాగిందని ఓ రేంజ్ లో కామెంట్స్ వేస్తూ వస్తున్నారు. ఈ కామెంట్స్ ఫై డైరెక్టర్ వంశీ పైడిపల్లి అగ్రం వ్యక్తం చేసారు. సినిమాలు తీసేందుకు మేకర్స్ తెరవెనుక పడే కష్టా్న్ని గుర్తించలేని జనాలు దానిని సీరియల్ అని ఎలా పిలుస్తారని ఓ ఇంటర్వ్యూలో అడిగాడు వంశీ పైడిపల్లి. నిజానికి టీవీ సీరియల్స్ కూడా చాలా మందిని సాయంత్రం వేళ ఎంటర్‌టైన్ చేస్తు్న్నాయని.. ఈ కామెంట్స్ వల్ల వాటి స్థాయి కూడా దిగజారకూడదని ఆయన అన్నారు.

‘ఈ రోజుల్లో ఒక సినిమా చేయడం ఎంత కష్టమో తెలుసా? ఒక సినిమా వర్క్ చేయడానికి ఒక టీమ్ ఎంత వర్క్ అవుట్ చేస్తుందో తెలుసా? ప్రేక్షకులను అలరించడానికి వాళ్లు ఎంత కష్టపడుతున్నారో తెలుసా? బ్రదర్.. ఇది జోక్ కాదు. ప్రతి సినిమా నిర్మాత ఎన్నో త్యాగాలు చేస్తుంటారు’ అని వంశీ పేర్కొన్నారు. అంతేకాదు ఈ సినిమా టీవీ సీరియల్ లాంటిదని అనడంలో వారి ఉద్దేశ్యం ఏమిటని ప్రశ్నించిన వంశీ.. వాటిని ఎందుకు దిగజార్చుతున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు.

సాయంత్రం పూట ఎంత మంది సీరియల్స్ చూడటంలో నిమగ్నమై ఉంటారో తెలుసా? అని ఈ విషయంలో వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ప్రతి ఇంట్లో బామ్మలు, అమ్మమ్మలు సీరియల్స్‌తోనే కాలక్షేపం చేస్తున్నారంటూ.. ‘దేనినీ కించపరచవద్దు బ్రదర్! అది కూడా సృజనాత్మక పనే. మీరు ఎవరినైనా తక్కువ చేయాలనుకుంటే మిమ్మల్ని మీరు తగ్గించుకుంటున్నారని గుర్తుంచుకోండి’ అంటూ ఫైర్ అయ్యారు.

ఇక వారసుడు విషయానికి వస్తే..విజయ్ – రష్మిక జంటగా దిల్ రాజు నిర్మాణంలో తమిళ్ , తెలుగు తో పాటు పలు భాషల్లో రిలీజ్ అయ్యింది. తమిళనాట పర్వాలేదు అనిపించుకున్న ఈ మూవీ..తెలుగు లో మాత్రం పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. పక్కన వీరయ్య , వీర సింహ రెడ్డి ల హావ కొనసాగుతుండడం తో వారసుడు ను చూసేందుకు సినీ ప్రేక్షకులు పెద్దగా ఇంట్రస్ట్ చూపించడం లేదు. ఆ సినిమాల టికెట్స్ దొరకని వారు వారసుడు కు పోతున్నారు తప్ప సినిమా చూడాలని మాత్రం ఎవ్వరు వెళ్లడం లేదు. ఇక కలెక్షన్లు కూడా అంతంత మాత్రమే ఉన్నాయి.

follow us