రెండు యాక్షన్ల మధ్య విజయ్ సెంటిమెంట్ వర్క్ అవుట్ అవుతుందా..?

2023 సంక్రాంతి పోరు గట్టిగానే ఉన్నట్లు తెలుస్తుంది. ఒకరు , ఇద్దరు కాదు ముగ్గురు అగ్ర హీరోలు సంక్రాంతి పోటీలోకి దిగుతున్నారు. వారిలో ఇద్దరు తెలుగు హీరోలు కాగా..మరొకరు తమిళ్ హీరో. సంక్రాంతి బరిలో మెగాస్టార్ చిరంజీవి – బాబీ కలయికలో తెరకెక్కిన వాల్తేర్ వీరయ్య జనవరి 13 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఫుల్లెన్త్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ మూవీ ఉండబోతుంది. ఇప్పటికే ఈ సినిమా తాలూకా సాంగ్స్ , టీజర్స్ , స్టిల్స్ ఇలా అన్ని కూడా మాస్ ఫ్యాన్స్ కు ఫుల్ యాక్షన్ ప్యాక్ అన్నట్లు ఉన్నాయి.
ఇదే బరిలో నటసింహ నందమూరి బాలకృష్ణ వీర సింహ రెడ్డి గా రాబోతున్నాడు. క్రాక్ తో అసలైన యాక్షన్ ఎంటర్టైనర్ ఇచ్చిన గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో ఈ మూవీ తెరకెక్కింది. ఈ చిత్ర ట్రైలర్ చూస్తుంటూనే సినిమా ఏ రేంజ్ లో గోపి తెరకెక్కించారో అర్ధం అవుతుంది. ఇది కూడా పొలిటికల్ యాక్షన్ భరిత చిత్రంగా రాబోతుందని తెలుస్తుంది. ఈ రెండు యాక్షన్ కథలతో వస్తుంటే…తమిళ్ హీరో విజయ్ – మహర్షి ఫేమ్ వంశీ పైడిపల్లి కలయికలో తెలుగు, తమిళ్ భాషల్లో తెరకెక్కిన వారసుడు మూవీ ఫుల్లెన్త్ ఫ్యామిలీ & సెంటిమెంట్ కథగా రాబోతుంది. ఇప్పటివరకు విజయ్ ఎక్కువగా యాక్షన్ కథలతోనే ప్రేక్షకులను మెప్పించాడు. ఇక ఇప్పుడు ఫ్యామిలీ కథతో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు.
ఈ కథ బ్రదర్ సెంటిమెంట్ తో సాగనుందని అంటున్నారు. ఇందులో విజయ్, శ్రీకాంత్, ప్రభు, శరత్ కుమార్… వీళ్లంతా బ్రదర్స్ గా నటించారని అంటున్నారు. ఈ బ్రదర్ సెంటిమెంట్ తో రూపొందించిన సీన్లు… జయసుధ, ప్రకాజ్ రాజ్ ల మధ్య వచ్చే సన్నివేశాలు ఫ్యామిలీ ఆడియన్స్ ను కట్టిపడేస్తాయని అంటున్నారు. సర్రినోడు తర్వాత శ్రీకాంత్ కి మంచి పాత్ర పడిందని చెబుతున్నారు. మరి ఈ బ్రదర్ సెంటిమెంట్…యాక్షన్ కథలను తట్టుకొని నిలబడగలదా..అని సినీ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. మరి ఈ ప్రశ్న కు జవాబు కావాలంటే మరి కొద్దీ రోజులు ఆగాల్సిందే.