వరుణ్ ధావన్ “భేదియా” చిత్రం నుండి “చిలిపి వరాలే ఇవ్వు” వీడియో సాంగ్ విడుదల

వరుణ్ ధావన్ “భేదియా” చిత్రం నుండి “చిలిపి వరాలే ఇవ్వు” వీడియో సాంగ్ విడుదల

ఎన్నో సూపర్ హిట్ ఫిలిమ్స్ ను డిస్ట్రిబ్యూషన్ చేసిన “గీతా ఫిలిం డిస్ట్రిబ్యూషన్” సంస్థ రీసెంట్ గా కాంతార చిత్రంతో మంచి హిట్ అందుకుంది. ఇప్పుడు వరుణ్ ధావన్ నటిస్తున్న “భేదియా” చిత్రంతో మరో హారర్-కామెడీ యూనివర్స్‌ సినిమాను తెలుగు ప్రేక్షకులుకు అందించడానికి సిద్దమవుతుంది.

వరుణ్ ధావన్ మరియు కృతి సనన్ నటిస్తున్న సినిమా “భేదియా”
ఈ చిత్రం నుండి ‘తుమ్కేశ్వరి’ అనే మొదటి పాట ఇటీవల విడుదలైంది మరియు ఆ పాటకు విశేష స్పందన లభించింది. ఆ పాట విజయవంతమైన తరుణంలో భేదియా టీం ఇప్పుడు ‘చిలిపి వరాలే ఇవ్వు’ అనే వీడియో సాంగ్ ను అధికారికంగా లాంచ్ చేశారు.

భేదియా చిత్రానికి సచిన్ జిగర్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిలిపివరాలే ఇవ్వు పాటను కార్తీక్ ఆలపించారు. ఈ వీడియో సాంగ్ మంచి ఫీల్ ను క్రియేట్ చేస్తుంది. ఈ చిత్రానికి అమితాబ్ భట్టాచార్య & యనమండ్ర రామకృష్ణ సాహిత్యం అందించారు.

2018 లో వచ్చిన స్త్రీ, 2021 లో వచ్చిన రూహి తరువాత, దినేష్ విజన్ యొక్క హారర్-కామెడీ యూనివర్స్‌లో వస్తున్న చిత్రం “భేదియా” ఈ చిత్రానికి అమర్ కౌశిక్ దర్శకత్వం వహించారు. హిందీ, తమిళం మరియు తెలుగులో పాన్ ఇండియా స్థాయిలో నవంబర్ 25 న థియేటర్లలోకి రానుంది.ప్రముఖ చిత్ర నిర్మాత అల్లు అరవింద్ తెలుగులో “గీత ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్” ద్వారా “భేదియా” తెలుగులో విడుదల చేస్తున్నారు.

follow us