టాలీవుడ్ లో విషాదం..వేదం రామయ్య ఇకలేరు..!

టాలీవుడ్ లో మరో విషాదం చోటు చేసుకుంది. వేదం సినిమాలో సిరిసిల్ల రాములు గా నటించిన నాగయ్య ఈరోజు ఉదయం 4:30 నిమిషాలకు మరణించారు. నాగయ్య క్రిష్ దర్శకత్వంలో వచ్చిన వేదం సినిమాలో నటించారు. ఈ సినిమాలో కీలక పాత్రలో నాగయ్య నటించారు. ఆయన నటనకు గాను ప్రేక్షకులు ఫిదా అయ్యారు. సినిమాలో తన మనవడి చదువు కోసం కిడ్నీ అమ్ముకున్న సన్నివేశంలో నాగయ్య ఎడిపించారు. ఈ సినిమాలో నాగయ్య నటనకు గాను అవార్డులు సైతం వరించాయి.
ఈ సినిమా తరువాత నాగయ్య రెండు మూడు సినిమాలు చేశారు. కానీ పెద్దగా గుర్తింపు రాలేదు. అయితే రాములు ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఎదురుకునట్టు తెలుస్తోంది. సినిమాల్లో అవకాశాలు లేక..హైదరాబాద్ లో ఉండలేక సొంతూళ్లకు వెళ్లలేక ఆర్థిక ఇబ్బందులు ఎదురుకున్నట్టు తెలుస్తోంది. దాంతో ఫిల్మ్ నగర్ లో ఆయన భిక్షాటన చేసినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కేటీఆర్ ఆయనను తన నివాసానికి పిలిచి ఆర్థికసహయం చేశారు.