‘మా బావ మనోభావాలు’ అంటున్న వీరసింహ రెడ్డి

‘మా బావ మనోభావాలు’ అంటున్న వీరసింహ రెడ్డి

వీరసింహ రెడ్డి నుండి మూడో సాంగ్ రాబోతుంది. ‘మా బావ మనోభావాలు’ అంటూ సాగే ఈ సాంగ్ ను ఈ నెల 24 న రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. నందమూరి బాలకృష్ణ – శృతి హాసన్ జంటగా క్రాక్ ఫేమ్ గోపీచంద్ మలినేని డైరెక్షన్లో తెరకెక్కుతున్న మూవీ వీరసింహరెడ్డి. సంక్రాంతి కానుకగా జనవరి 12 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ తరుణంలో చిత్ర యూనిట్ సినిమా ప్రమోషన్ కార్య క్రమాలను స్పీడ్ చేసారు. వరుస పెట్టి సినిమాలోని సాంగ్స్ ను రిలీజ్ చేసి అలరిస్తున్నారు. ఇప్పటికే జై బాలయ్య , సుగుణ సాంగ్స్ ను రిలీజ్ చేసి సినిమా ఫై అంచనాలు పెంచిన మేకర్స్..ఇప్పుడు మూడో సాంగ్ ను రిలీజ్ చేసేందుకు సిద్ధమయ్యారు.

డిసెంబర్ 24న సాయంత్రం 3:19 నిమిషాలకు విడుదల కానున్న ఈ పాటకు సంబంధించిన ఓ పిక్ ని మేకర్స్ బుధవారం విడుదల చేశారు. చుట్టూ డ్యాన్సర్స్ మధ్య బ్లాక్ బ్లేజర్ గాగుల్స్ ధరించి డాన్ ల రాయల్ లుక్ లో బాలకృష్ణ కూర్చుని కనిపిస్తున్నాడు. స్టిల్ లోనే బాలయ్య ఈ రేంజ్ లో రచ్చ చేస్తే 24న విడుదల కానున్న ఈ పాటలో ఇంకెంత రచ్చ చేస్తాడో అని అభిమానులు మాట్లాడుకుంటున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ వారు అత్యంత భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ మూవీలో మలయాళ నటి హనీరోజ్ వరలక్ష్మీ శరత్ కుమార్ లాల్ రవిశంకర్ నటిస్తున్నారు. కీలకమైన విలన్ పాత్రలో కన్నడ నటుడు ‘దునియా’ విజయ్ నటిస్తున్నాడు. 2023 సంక్రాంతికి అత్యంత భారీ స్థాయిలో ఈ మూవీని మైత్రీ వారు రిలీజ్ చేయబోతున్నారు.

follow us