వీరసింహరెడ్డి సెన్సార్ టాక్

నందమూరి బాలకృష్ణ – క్రాక్ ఫేమ్ గోపీచంద్ మలినేని కలయికలో వస్తున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ వీరసింహరెడ్డి. అఖండ తర్వాత బాలయ్య నుండి వస్తున్న సినిమా కావడం, అలాగే క్రాక్ తర్వాత గోపీచంద్ డైరెక్ట్ చేయడంతో ఈ మూవీ ఫై భారీ అంచనాలే నెలకొని ఉన్నాయి. ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గని రేంజ్ లో సినిమా ఉందని తాజాగా రిలీజ్ అయినా ట్రైలర్ చూస్తే అర్ధమవుతుంది. ఈ ట్రైలర్ చూసిన తర్వాత నందమూరి అభిమానులే కాదు యావత్ సినీ ప్రేక్షకులు , సినీ ప్రముఖులు సైతం ఎప్పుడెప్పుడు వీరసింహ రెడ్డి ని చూద్దామా అని ఎదురు చూస్తున్నారు.
సినిమా రిలీజ్ సమయం దగ్గరపడుతుండడం తో చిత్రయూనిట్ సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసినట్లు తెలుస్తుంది. సినిమాను చూసిన సెన్సార్ బృందం సినిమాకు యూ/ఏ సర్టిఫికెట్ జారీచేసినట్లు సమాచారం. వాస్తవానికి ట్రైలర్ చూసిన సినీ జనాలు సినిమాకు ఏ సర్టిఫికెట్ వస్తుందని భావించారు కానీ.. యూ/ఏ సర్టిఫికెట్ రావడం తో హమ్మయ్య అనుకుంటున్నారు. సినిమా చాల బాగా వచ్చిందని , థమన్ మరోసారి అఖండ లెవల్లో మ్యూజిక్ ఇచ్చాడని , బాలయ్య డాన్సులు , డైలాగ్స్ అన్నింట్లో ఇరగదీశాడని సెన్సార్ బృందం చెప్పడం తో మేకర్స్ సంబరాలు చేసుకుంటున్నారు.
మరోపక్క దుబాయ్ సెన్సార్ సభ్యుడు ఉమైర్ సంధు తన ట్విట్టర్ లో ఫస్ట్ రివ్యూ ఇచ్చాడు. సినిమాకు బాలకృష్ణ మూలస్తంభంలా నిలబడ్డాడని , ఆయన మరో వైవిధ్యమైన పాత్రలో కనిపించడమే కాకుండా అద్భుతమైన నటనను కనపరిచాడని తెలిపారు. మాస్ ఆడియన్స్‌ను బాలకృష్ణ తన పంచ్ డైలాగులతో అలరించడే కాదు.. కొన్ని సన్నివేశాల్లో తన భావోద్వేగ నటనతో కన్నీళ్లు పెట్టించారు. అలాగే ఈ స్టార్ హీరో డాన్సులు కుమ్మేశారు. పాటలకు ఆయన అభిమానులకు పండగ వాతావరణాన్ని తీసుకొస్తాయి. నాన్ స్టాప్ యాక్షన్ స్టంట్స్! స్టోరీ, స్క్రీన్‌ప్లే కొత్తగా ఏమీ లేకపోయినప్పటికీ సినిమా ఎంగేజింగ్‌గా, టైంపాస్ అయ్యే విధంగా ఉంది. టర్కీ లొకేషన్స్‌ను అద్భుతంగా చూపించారు. శృతిహాసన్ మరోసారి కట్టిపడేసింది. ఆఖరి 15 నిమిషాలు సినిమా అద్భుతం అంటూ సినిమాను ఆకాశానికి ఎత్తేసాడు.