బాలయ్య – శృతిల రొమాంటిక్ సాంగ్ అదిరిపోయింది

వీరసింహరెడ్డి నుండి అదిరిపోయే రొమాంటిక్ సాంగ్ వచ్చింది. నందమూరి బాలకృష్ణ – శృతి హాసన్ జంటగా క్రాక్ ఫేమ్ గోపీచంద్ మలినేని డైరెక్షన్లో తెరకెక్కుతున్న మూవీ వీరసింహరెడ్డి. సంక్రాంతి కానుకగా జనవరి 12 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ తరుణంలో మేకర్స్ సినిమా ప్రమోషన్స్ ను స్పీడ్ చేసారు. ఇప్పటికే పలు స్టిల్స్ , సాంగ్ విడుదల కాగా..ఈరోజు గురువారం సినిమాలోని సుగుణ అనే సాంగ్ ను రిలీజ్ చేసి సినిమా ఫై ఆసక్తి పెంచారు.

ఈ సాంగ్ లో బాలకృష్ణ ఏజ్ లెస్ లుక్ తో యువ హీరోలాగా కనిపిస్తున్నాడు. శృతి హాసన్ మల్టీ-కలర్ డ్రెస్ లో అందంగా కనిపిస్తోంది. ‘సీమా కుట్టిందే.. సిట్టి సీమా కుట్టిందే.. దిల్ కందిపోయే లా..ప్రేమా పుట్టిందే..పిచ్చి ప్రేమ పుట్టిందే’ అంటూ సాగే పాట మాస్ ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకోవడం ఖాయంగా కనిపిస్తుంది. మరోసారి థమన్ చక్కటి సంగీతాన్ని అందించారు. ఈ పాటకి రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించగా.. రామ్ మిరియాల.. స్నిగ్ధ శర్మ ఆలపించారు. శేఖర్ మాస్టర్ కోరియోగ్రఫీ చేశారు. మీరు కూడా ఈ సాంగ్ ఫై లుక్ వెయ్యండి.

follow us