వీరయ్య కు రెడ్డి కి ఇంత హైప్ అవసరమా బాసు…?

నందమూరి బాలకృష్ణ – మెగాస్టార్ చిరంజీవి మరోసారి సంక్రాంతి బరిలో పోటీపడుతున్నారు. గతంలో రెండుసార్లు పోటీ పడగా..ఒకసారి బాలయ్య, మరోసారి చిరంజీవి పైచేయి సాధించారు. ఇక ఇప్పుడు మూడోసారి ఎవరు ఫై చేయి సాధిస్తారా అనేది ఆసక్తి గా మారింది. చిరంజీవి – బాబీ కలయికలో వాల్తేర్ వీరయ్య తెరకెక్కగా..క్రాక్ ఫేమ్ గోపీచంద్ మలినేని – బాలకృష్ణ కలయికలో వీరసింహ రెడ్డి చిత్రం తెరకెక్కింది. ఈ రెండు మాస్ సినిమాలే కావడం..ఈ రెండు చిత్రాలకు ఒకే నిర్మాతలు కావడమే కాదు..ఈ రెండు సినిమాల్లో ఒకే హీరోయిన్ కావడం విశేషం.
ఒకేసారి ఇద్దరు అగ్ర హీరోలు పోటీపడడం..అగ్ర నిర్మాణ సంస్థ నిర్మించడం..వరుస హిట్లు అందుకున్న డైరెక్టర్స్ డైరెక్షన్ చేయడం తో ఈ రెండు సినిమాల ఫై అభిమానుల్లో అంచనాలు తారాస్థాయి లో ఉన్నాయి. వాటికీ మించి అన్నట్లు చిత్ర మేకర్స్ ప్రమోషన్ కార్య క్రమాలు చేపడుతున్నారు. ఏ సినిమాకు ఏది తక్కువ కాదు అన్నట్లు ప్రమోషన్ ఈవెంట్స్ చేస్తూ..అంచనాలను పెంచుతున్నారు. అయితే ఇలా అంచనాలు పెంచడం అనేది మంచిది కాదని సినీ విశ్లేషకుల మాట. ఎందుకంటే అంచనాలు పెంచడం వల్ల..ఆ అంచనాలను అందుకోలేకపోతే రిజల్ట్ మరోలా ఉంటుందని అంటున్నారు. గతంలో భారీ అంచనాల మధ్య వచ్చిన సినిమాలు బొక్కబోర్లా పడ్డాయని గుర్తుచేస్తున్నారు. సాధారణ అంచనాలతో థియేటర్స్ కు వెళ్లిన ప్రేక్షకులకు అంచనాలు మించేలా సినిమా ఉండాలని..కానీ ముందే భారీ అంచనాలు పెంచేస్తే ఆ అంచనాలకు తగ్గట్లు సినిమా లేకపోతే నిరాశ చెందుతారని..ముఖ్యముగా భారీ అభిమాన బలం ఉన్న చిరు , బాలయ్య విషయంలో చాల జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. మరి ఈ రెండు సినిమాలు ఎలా ఉంటాయనేది మరికొద్ది రోజుల్లో తెలుస్తుంది.