వీరసింహరెడ్డి రన్ టైం ఎంతంటే..

వీరసింహరెడ్డి రన్ టైం ఎంతంటే..

నందమూరి బాలకృష్ణ – శృతి హాసన్ జంటగా క్రాక్ ఫేమ్ గోపీచంద్ మలినేని డైరెక్షన్లో తెరకెక్కుతున్న మూవీ వీరసింహరెడ్డి. సంక్రాంతి కానుకగా జనవరి 12 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ తరుణంలో ఈ సినిమా రన్ టైం 2 గంటల 45 నిమిషాలు వచ్చినట్లు తెలుస్తుంది.

ఈ మధ్య పాన్ ఇండియా సినిమాల రన్ టైమ్ సైతం 2 గంటల 20 నిమిషాల నుంచి 30 నిమిషాల వరకే ఉంటున్నాయి. కానీ వీర సింహ రెడ్డి మూవీ మాత్రం మరో 15 నిమిషాలు అదనంగా ఉండబోతోంది. సినిమాలో ఆ స్కోప్ ఉండటంతోనే రన్‌టైమ్ పెంచినట్లు చిత్ర యూనిట్ చెపుతుంది. మరి ఆ రన్ టైం సినిమా కు లాభం చేకూరుస్తుందా..లేదా అనేది చూడాలి.

Tags

follow us