వీరసింహరెడ్డి సుగుణ సాంగ్ మేకింగ్

వీరసింహరెడ్డి సుగుణ సాంగ్ మేకింగ్

బాలకృష్ణ – శృతి హాసన్ జంటగా తెరకెక్కుతున్న మూవీ వీరసింహరెడ్డి. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్స్ ను భారీగా జరుపుతూ సినిమా ఫై ఆసక్తి , అంచనాలు నింపుతున్నారు. ఇప్పటీకే జై బాలయ్య, సుగుణ సాంగ్స్ రిలీజ్ చేయగా..ఈరోజు గురువారం మా బావ మనోభావాలు అనే సాంగ్ ను రిలీజ్ చేయబోతున్నారు. అంతకంటే ముందే సుగుణ సాంగ్ తాలూకా మేకింగ్ వీడియో ను రిలీజ్ చేసారు. ఈ డ్యుయెట్‌ సాంగ్‌లో శేఖర్‌ మాస్టర్ కంపోజ్‌ చేసిన స్టైలిష్ డ్యాన్స్ తో అదరగొట్టేస్తున్నారు బాలకృష్ణ, శృతిహాసన్‌. ఈ సాంగ్‌ మేకింగ్‌ విజువల్స్‌ను ట్విటర్‌లో షేర్ చేశారు మైత్రీ మూవీ మేకర్స్ టీం.

టర్కీలోని అందమైన లొకేషన్లలో ఈ పాటను చిత్రీకరించారు. సుగుణ సుందరి పాట ఈ సినిమాకు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ పాటను రామజోగయ్యశాస్త్రి రాయగా.. రామ్‌ మిర్యాల, స్నిగ్ధ శర్మ పాడారు. ఎస్‌ థమన్ అందించిన మ్యూజిక్ పాటను మరో స్థాయికి తీసుకెళ్లింది. ఇక ఈరోజు విడుదల కాబోతున్న మా బావ మనోభావాలు అనే సాంగ్ ఎలా ఉండబోతుందో అని అంత ఆసక్తి గా ఉన్నారు.

follow us