గురువుకోసం వెంకీ కుడుముల రివ‌ర్స్ గేర్..!

  • Written By: Last Updated:
గురువుకోసం వెంకీ కుడుముల రివ‌ర్స్ గేర్..!

టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ వెంకీ కుడుముల మళ్లీ అసిస్టెంట్ డైరెక్టర్ అవతారం ఎత్తబోతున్నారట. అదేంటి ఇప్పటికే సూపర్ హిట్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న వెంకీ మళ్లీ అసిస్టెంట్ గా మారటం ఏంటనుకుంటున్నారా.? అయితే వెంకీ సహాయ దర్శకుడిగా మారేది గురువు త్రివిక్రమ్ సినిమా కోసమేనట. ప్రస్తుతం త్రివిక్రమ్ మహేష్ బాబు సినిమా కోసం స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేస్తున్నారు. ఈ స్క్రిప్ట్ కోసం వెంకీ కూడా పనిచేస్తున్నారు.

అంతే కాకుండా ఈ సినిమా షూటింగ్ సమయంలోనూ త్రివిక్రమ్ ..మహేష్ లతో కలిసి వెంకీ పని చేస్తారట. ఇక గతంలోనూ వెంకీ త్రివిక్రమ్ సినిమాలకు సహాయకుడిగా పనిచేసారు. అందుకే త్రివిక్రమ్ ను వెంకీ గురువుగా భావిస్తారు. ఇదిలా ఉండగా వెంకీ ఛలో సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యాడు. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో నితిన్ తో భీష్మ సినిమా చేసే ఛాన్స్ కొట్టేసాడు. ఇక ఈ చిత్రం కూడా సూపర్ హిట్ గా నిలిచింది.

follow us