మెగా హీరోను లైన్ లో పెట్టిన వెంకీ కుడుముల.. !

యంగ్ డైరెక్టర్ వెంకీ కుడుముల ప్రస్తుతం ఫుల్ జోష్ మీద ఉన్నాడు. ఛలో సినిమాతో దర్శకుడిగా పరిచయమైన వెంకీ సూపర్ హిట్ అందుకున్నారు. ఆ తరవాత నితిన్ హీరోగా భీష్మ చిత్రాన్ని తీసి తన టాలెంట్ ను ప్రూవ్ చేసుకున్నారు. ఇక ఈ రెండు సినిమాలు మంచి విజయం సాధించడంతో వెంకీ ఇప్పుడు ఏకంగా మెగా హీరో వరుణ్ తేజ్ ను లైన్ లో పెట్టారని టాక్ వినిపిస్తోంది. వరుణ్ తేజ్ ప్రస్తుతం గని అనే స్పోర్ట్స్ డ్రామాలో నటిస్తున్నారు. కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కబోతుంది.
అంతే కాకుండా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఎఫ్ 3 సినిమాలో నటిస్తున్నారు. కరోనా విజృంభనతో ఈ రెండు సినిమా షూటింగ్ లకు బ్రేక్ పడింది. అయితే ఈ మధ్య వచ్చిన కాళీ సమయంలో వెంకీ కుడుముల చెప్పిన కథను వరుణ్ తేజ్ విన్నారట. అంతే కాకుండా కథ భాగా నచ్చేయడంతో మెగా హీరో గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. అంతే కాకుండా ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో నిర్మించబోతున్నట్టు కూడా టాక్. ఇక అన్నీ అనుకున్నట్టు జరిగితే దసరాకు ఈ సినిమాను పట్టాలెక్కించభోతున్నట్టు తెలుస్తుంది.