ప్లాన్ మార్చిన వకీల్ సాబ్ డైరెక్టర్.. !

వకీల్ సాబ్ తో సూపర్ హిట్ కొట్టిన దర్శకుడు వేణు శ్రీరామ్ ఎన్నో ఏళ్ల క్రితం వేణు డైరెక్టర్ గా పరిచయం అయ్యారు. అయితే వేణు శ్రీరామ్ కు గుర్తింపు వచ్చింది మాత్రం వకీల్ సాబ్ సినిమాతోనే అంతే కాకుండా వేణు శ్రీరామ్ సినిమాలన్నీ దిల్ రాజు బ్యానర్ లోనే చేశారు. వాటిలో ఓ మైఫ్రెండ్ అనుకున్నమేర విజయం సాధించలేకపోయినా ఎంసీఏ, వకీల్ సాబ్ చిత్రాలు మంచి విజయం సాధించాయి. వకీల్ సాబ్ సినిమా తరవాత కూడా మళ్లీ వేణు శ్రీరామ్ తో ఓ సినిమా తీస్తానని దిల్ రాజు వెల్లడించారు. కానీ పరిస్థితుల కారణంగా ఆ సినిమా పట్టాలెక్కేలా కనిపించడం లేదు. దాంతో వేణు శ్రీరామ్ కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది.
వకీల్ సాబ్ తరవాత వేణుకు ప్రముఖ నిర్మాణ సంస్థల నుండి ఆఫర్లు వస్తున్నాయట. ఇటీవల ఓ ఇంటర్యూలో కూడా వేరే బ్యానర్లలో సినిమాలు చేసేందుకు తాను రెడీ అని వేణు చెప్పారు. అయితే తాజా సమాచారం ప్రకారం వేణు ఓ ప్రముఖ హీరోకు కథను వినిపించగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ నిర్మించబోతుందట. త్వరలోనే దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ రాబోతున్నట్టు తెలుస్తుంది. ఇక తన ఆత్మీయ దర్శకుడు వేరే బ్యానర్ లో సినిమా తీసేందుకు వెళుతుండటంతో దిల్ రాజు కూడా బాధలో ఉన్నారట.