అక్కడికి రాన్నన విద్యాబాలన్ ! రెచ్చిపోయిన మంత్రి !

అక్కడికి రాన్నన విద్యాబాలన్ ! రెచ్చిపోయిన మంత్రి !

సినిమాలపై రాజకీయ నాయకుల ప్రభావం చాలా వరకు ఉంటుంది. తాము ఎంత చెబితే అంతే అనే విధంగా వ్యవహరిస్తూ ఉంటారు. ప్రజలపై కూడా తమ ఆధిపత్యం కొనసాగిస్తూ ఉంటారు. ఇది అన్నీ సందర్భాలో చెల్లు బాటు కాదు. ఈ విషయం మధ్య ప్రదేశ్ కు చెందిన మంత్రి విజయ్ షా బాగా తెలిసి వచ్చినట్లు ఉన్నది. ఈ మధ్య ఆయనకు “షేర్నీ” చిత్రా యూనిట్ పెద్ద షాక్ ఇచ్చింది.

బాలీవుడ్ అందాల నటి విద్యాబాలన్ కు ఎదురైంది. ఆమె నటిస్తున్న షేర్నీ చిత్రం యొక్క షూటింగ్ మధ్యప్రదేశ్ అడవి ప్రాంతం లో జరుపుకుంటుంది. కావున ఆ చిత్రం అక్కడ షూటింగ్ జరుపుకోవడానికి ఆటవిశాక అధికారుల నుండి పర్మిషన్ తీసుకున్నారు. వారు వారిపైన ఉండే అధికారులు, మంత్రుల దగ్గర నుండి అనుమతి తీసుకున్నారు. కానీ… మధ్యప్రదేశ్ కు చెందిన మంత్రి విజయ్ షా పర్మిషన్ ఇచ్చి, ” షేర్నీ” చిత్రా యూనిట్ కు ఓ షరత్ ను విధించాడు. ఈ చిత్రంలో నటించే విద్యాబాలన్ ను డిన్నర్ కు రావాలని ఆహ్వానించాడు. అదే విషయం విద్యాబాలన్ కు చెప్పడంతో ఆమె తిరస్కరించింది. ఇలాంటివి కామన్ గా జరుగుతుంటాయని ఆమెకు బాగా తెలుసు. అందుకే ఆమె నో చెప్పడంతో ఆ మంత్రి కోపం తో షూటింగ్ కు సంబందించిన మొత్తం సామాగ్రిని స్వాధీనం చేసుకున్నాడు.

ఇంకా ఏమి చెయ్యాలో తెలియని పరిస్థితిలో ఉన్న యూనిట్ కు మీడియా రాకతో కొండంత బలం వచ్చినట్లు అయింది. అదే విషయంపై మంత్రిని ప్రశ్నించగా షెర్ని టీమ్ నన్ను డిన్నర్ కు పిలవగా నాకు వెళ్ళడం కుదరలేదు అందుకే నా మీద కావాలనే ఇలాంటివి పుట్టిస్తున్నారు అని ఆరోపించాడు. మరి షూటింగ్ కు ఇచ్చిన పర్మిషన్ ఎందుకు క్యాన్షల్ చేశాడో అతని విజ్ఞతకే వదిలేశారు. అలాగే షూటింగ్ కు సంబంధించిన సామాగ్రిని ఎందుకు స్వాధీనం చేసుకున్నాడో చెప్పాలి అంటున్నారు. మంత్రి అయినంత మాత్రాన ఇలాంటి పనులు చేస్తారా అంటూ సోషల్ మీడియా వేధికగా ఏకి పారేస్తున్నారు.

follow us

Related News