బాలకృష్ణ కు జోడిగా విజయ్ దేవరకొండ హీరోయిన్..

అఖండ సూపర్ స్టార్ తర్వాత హిట్ తర్వాత నందమూరి బాలకృష్ణ స్పీడ్ పెంచారు. ఓ పక్క సినిమాలే కాదు పలు షోస్ , వాణిజ్యప్రకటలు చేస్తూ ఆకట్టుకుంటున్నారు. ప్రస్తుతం వీరసింహరెడ్డి తో సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. క్రాక్ ఫేమ్ గోపీచంద్ మలినేని డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ మూవీ లో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా , తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ తాలూకా పోస్టర్స్ , టీజర్ , సాంగ్ ఇలా ప్రతిదీ సినిమా ఫై అంచనాలు పెంచేసాయి. ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా సినిమా తెరకెక్కిందని చిత్ర యూనిట్ చెపుతున్నారు.
ఇక ఈ మూవీ సెట్స్ ఫై ఉండగానే అనిల్ రావిపూడి డైరెక్షన్లో మరో సినిమా కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు బాలయ్య. ఈ చిత్రాన్ని అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా రూపొందిస్తున్నట్లు అనిల్ రావిపూడి రీసెంట్ గా చెప్పడం జరిగింది. ప్రస్తుత ప్రీ ప్రొడక్షన్ పనులు జరపుకుంటున్న ఈ చిత్రం మరో రెండు, మూడు వారాల్లో సెట్స్ మీదకు వెళ్ళనుంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా ప్రియాంక జవాల్కర్‌ను మేకర్స్ ఎంపిక చేశారట. ఇటీవలే చిత్రబృందం ప్రియాంకను సంప్రదించగా.. ఆమె కూడా వెంటనే ఓకే చెప్పిందట. ఇక ఇప్పటికే ప్రియాంకపై ఫోటో షూట్ కూడా నిర్వహించినట్లు సమాచారం. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుంది. తండ్రీ, కూతురు సెంటిమెంట్‌తో సాగే ఈ సినిమాలో బాలయ్య కూతురుగా శ్రీలీల నటించనుంది. షైన్ స్క్రీన్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడు.
ప్రియాంక జవాల్కర్ ‘టాక్సీవాలా’, ‘తిమ్మరుసు’, ‘ఎస్ఆర్ కళ్యాణ మండపం’ వంటి చిత్రాలతో గుర్తింపు సంపాదించుకుంది. గతంలో స్టార్ హీరోలతో ఆమె సినిమాలు చేయలేదు. అయితే, ‘ఎన్‌బీకే108’ లో మెయిన్ హీరోయిన్ రోల్ ప్రియాంకకు దక్కితే ఆమె జాక్ పాట్ కొట్టేసినట్టే.