విజయ్ దేవరకొండ న్యూ లుక్ కు ఫ్యాన్స్ ఫిదా

విజయ్ దేవరకొండ న్యూ లుక్ కు ఫ్యాన్స్ ఫిదా

లైగర్ తో భారీ డిజాస్టర్ అందుకున్న విజయ్ దేవరకొండ..ప్రస్తుతం కొత్త సినిమాల కథలపై మరింత ఫోకస్ చేస్తున్నాడు. ప్రస్తుతం చేతిలో ఖుషి చిత్రం మాత్రమే ఉంది. అది కూడా సమంత అనారోగ్యానికి గురి కావడం తో షూటింగ్ కు బ్రేక్ పడింది. ప్రస్తుతం కమర్షియల్ యాడ్స్ చేస్తూ..కొత్త కథలను వింటూ వెళ్తున్నాడు.

తాజాగా ఓ యాడ్ కోసం ఇలా రఫ్ లుక్ లో కనిపించి ఫ్యాన్స్ ను ఫిదా చేసాడు. ఈ న్యూ లుక్ ఫొటోలు సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతున్నాయి. చాలా సింపుల్ టీ షర్ట్ లో ఆకట్టుకునే రఫ్ లుక్ తో విజయ్ దేవరకొండ ఉన్నాడు అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఈ లుక్ కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ముందు ముందు ఆయన నటించబోతున్న సినిమాల్లో ఇలా కనిపించాలని కోరుకుంటున్నాం అంటున్నారు.

follow us