అద్భుతం అన్నో అంటున్న రౌడీ స్టార్ !

అద్భుతం అన్నో అంటున్న రౌడీ స్టార్ !

విజయ్ దేవరకొండ అల్లు అర్జున్ కు తన రౌడీ బ్రాండ్ నుండి కొత్త కలెక్షన్స్ ను పంపించిన సంగతి తెలిసిందే. స్టైలిస్ స్టార్ ఆ బట్టలు వేసుకుని చాలా స్టైలిస్ గా కనిపిస్తున్నాడు. అల్లు అర్జున్ విజయ్ దేవరకొండకు తన ట్విటర్ ద్వారా థాంక్స్ మై డియర్ బ్రదర్ అంటూ విష్ చేశాడు. ఆ నేపథ్యంలోనే “రౌడీ” బ్రాండ్ కు స్పెషల్ థాంక్స్ చెప్పాడు. గతంలో కూడా విజయ్ తన దగ్గర ఉన్న ఓ స్పెషల్ కలెక్షన్ బన్నీ కి పంపించాడు. అల్లు అర్జున్ ఫోటోస్ పై ఫ్యాన్స్ నుండి అద్బుతమైన రెస్పాన్స్ వస్తుంది. అల్లు ఫాన్స్ రౌడీ స్టార్ కి థాంక్స్ చెబుతూ నైస్ కలెక్షన్స్ రౌడీ బ్రాండ్ అంటూ ప్రీ పబ్లిసిటీ చేస్తున్నారు.

అల్లు అర్జున్ షేర్ చేసిన తన ఫోటోస్ పై విజయ్ దేవరకొండ స్టన్నింగ్ అన్నో అంటూ కామెంట్ చేశాడు. విజయ్ కామెంట్స్ కి బన్నీ ఫాన్స్ ఫిదా అయ్యిపోతున్నారు. అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పుష్ప అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో రష్మిక మందన్నా బన్నీ కి జోడీ గా నటిస్తుంది. విజయ్ మాత్రం డాషింగ్ డైరక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఫైటర్ అనే మూవీలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తుంది. ఓవైపు సినిమాలు చేస్తూ బిజినెస్ లోనూ రానిస్తున్నాడు మన రౌడీ స్టార్.

follow us